గోదావరి , కృష్ణా నదుల నీటి వినియోగంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొలిక్కి రానుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల  వివరాలు సమర్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సూచించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల  ముఖ్యమంత్రులతో గత ఏడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. గోదావరి, కృష్ణా నదుల నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై అపెక్స్ కౌన్సిల్ ( Apex council ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన అంశాలపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ ( Union jal shakti minister Gajendra singh shekhawat ) ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు లేఖ  రాశారు. రెండు రాష్ట్రాల్లోనూ గోదావరి ( Godavari ), కృష్ణా ( Krishna ) నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల వివరాలు సమర్పిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో డీపీఆర్‌ లు సమర్పించాలని మరోసారి కోరింది. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించేందుకు కేంద్ర జలవనరుల శాఖ అనుమతి తప్పనిసరి. గత ఏడాది డిసెంబర్ 11 న  ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana cm kcr ) భేటీ సమయంలో కూడా డీపీఆర్‌లు సమర్పించాలని కేంద్రమంత్రి కోరారు. అయినా తెలంగాణ ఇప్పటివరకూ ఒక్క డీపీఆర్ ( DPR ) కూడా సమర్పించలేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కృష్ణానదిపై 8, గోదావరి నదిపై 7 ప్రాజెక్టుల్ని తెలంగాణ నిర్మిస్తోంది. 


Also read: GHMC గెజిట్‌ వచ్చేసింది.. మేయర్ ఎన్నిక దిశగా అడుగులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook