Amit Shah: రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారం..మునుగోడు సభలో అమిత్ షా..!
Amit Shah: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హాట్ హాట్‌గా ఉన్నాయి. మునుగోడులో సమర భేరిని బీజేపీ నిర్వహించింది. సభలో పాల్గొన్న కేంద్రమంత్రి అమిత్ షా..కీలక వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి అమిత్ షా మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టేందుకు కోమరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారని చెప్పారు. కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టేందుకు ఇది ఆరంభమన్నారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే..పొగ మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం మాయమైపోతుందని విమర్శించారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తానని గతంలో కేసీఆర్ చెప్పారని..పవర్‌లోకి వచ్చాక విస్మరించారని ఫైర్ అయ్యారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీయే గెలుస్తుందన్నారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. బీజేపీ ప్రభుత్వం రాగానే దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు కేంద్రమంత్రి అమిత్ షా. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందన్నారు. కేసీఆర్ కుటుంబసభ్యులకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏటీఎంలా మారిందని మండిపడ్డారు. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని అన్నారు. అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని జరుపుతామని స్పష్టం చేశారు.
మునుగోడులో బీజేపీ సమర భేరీని ఏర్పాటు చేసింది. సభ ద్వారా సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీలో చేరారు. కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు. కేసీఆర్ ఇచ్చే బీబీసీ తీసుకుని మోస పోవద్దని మరో నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీసీ అంటే బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ అని చెప్పారు. 8 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ చేసిందేమి లేదని ఫైర్ అయ్యారు. పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఏవి అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఐటీ, సీబీఐ, ఈడీ వచ్చినా భయపడేది లేదన్నారు. ఈసందర్భంగా కేసీఆర్ పాలనపై పలువురు బీజేపీ నేతలు మండిపడ్డారు. త్వరలో భారీగా చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు.
త్వరలో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో రాజకీయాలు హీటెక్కాయి. రాజకీయ పార్టీలు వరుసగా భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నాయి. నిన్న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించగా..ఇవాళ బీజేపీ చేపట్టింది. ఇటీవల కాంగ్రెస్, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. దీంతో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈఏడాది డిసెంబర్‌లో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది.
Also read:Pawan Fans Unhappy with Amit Shah: ఎన్టీఆర్ కు ఆహ్వానమా? అసంతృప్తితో పవన్ ఫాన్స్!
Also read:Amit Shah Munugode: కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతాం..కేంద్రమంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి