Bandi Sanjay Fires on KTR: ఈ ఫార్ములా రేస్ స్కాంలో మాజీమంత్రి కేటీఆర్ వ్యవహారిస్తున్న తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్ కొడుకేమైనా దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడా? ఆయన జైలుకు వెళితే బీఆర్ఎస్ నాయకులు గొడవ చేయడానికి? కేబినెట్ అనుమతి లేకుండా సర్కార్ సొమ్మును అప్పనంగా విడుదల చేయాల్సిన అవసరమేముంది? పైగా సీఎంను పట్టుకుని లొట్టపీసు సీఎం, చిట్టినాయుడు, సన్నాసిగాడు అని తిడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?’’అని ప్రశ్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేటీఆర్ తిడుతున్నా సీఎం పట్టించుకోకుండా విచారణ పేరుతో అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తున్నారంటే తనకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని బండి సంజయ్‌ అన్నారు.  కేసీఆర్‌తో రేవంత్ రెడ్డి లోపాయికారీ ఒప్పందం చేసుకున్నట్లు అనుమానమొస్తుందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ చేసిన స్కాంలు తెరపైకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టి వస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలను ఎండగట్టడంతోపాటు కేసీఆర్ కుటుంబ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ఈరోజు కరీంనగర్ లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 


"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఒక్కటేనా? అనే అనుమానం వస్తోంది. సీఎంను పట్టుకుని లొట్టపీసు సీఎం, చిట్టి నాయుడు, సన్నాసి అని తిడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? వీళ్ల మధ్య ఏమైనా లోపాయికారీ ఒప్పందం జరిగిందా? ఈ పార్ములా సహా అనేక అవినీతి ఆరోపణలున్నా ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? పైగా అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? పైగా అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ నేతలు గొడవ చేయాలనుకుంటున్నారు. నేనడుగుతున్నా.. కేటీఆర్ ఏమైనా దేశం కోసం కొట్లాడిన స్వాతంత్ర్య సమర యోధుడదా? ప్రజా సమస్యలపై పోరాడినోడా? కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డోడు. కేబినెట్ ఆమోదం లేకుండా కోట్లు నిధులు విడుదల చేయడానికి అంత ఆత్రం ఎందుకు? ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎట్లా రిలీజ్ చేసిండు? తప్పు చేసి కప్పి పుచ్చుకోవడానికి రూ.700 కోట్ల లాభం వచ్చినట్లు డ్రామాలాడుతున్నరు? నీకు దమ్ముంటే 700 కోట్ల లాభం ఎట్లా వచ్చిందో లెక్క చెప్పు. ఆ లాభం వచ్చిన సొమ్ము యాడ ఉందో ప్రజల ముందుంచు.


నేను అడుగుతున్నా.. ఈఫార్ములా కేసులో కేబినెట్ ఆమోదం లేకుండా కోట్లు చెల్లించాల్సిన అవసరం ఏముంది? ఫీజు రీయంబర్స్ రాక లక్షల మంది విద్యార్థులు అల్లాడుతుంటే ఈఫార్ములాపై చూపిన ఆత్రం విద్యార్థులపై ఎందుకు చూపలేదు? ఆరోగ్యశ్రీ నిధుల విడుదలపై ఎందుకు చూపడం లేదు? కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసు వ్యవహారమే. ఎందుకంటే బామ్మర్థి ఫాంహౌజ్ కేసులో డ్రగ్స్ తో దొరికినా హడావుడి చేసి చివరకు లొట్టపీసు వ్యవహారం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం, ధరణి భూముల వ్యవహారంపైనా హడావుడి చేసి చివరకు లొట్టపీసు వ్యవహారం చేశారు. ఎందుకంటే కేసీఆర్ కాంగ్రెస్ నుండి వచ్చినోడే. కాంగ్రెస్ కథలన్నీ తెలుసు. 


ఏదైమైనా స్కాం తెరమీదకు రాంగనే ఢిల్లీకి పోయి కప్పం కట్టి వస్తున్నడు. ఆ కేసులన్నీ లొట్టపీసు వ్యవహారంగా మారుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే... ఈ రెండు పార్టీల రాజకీయ డ్రామాలను ఎండగడతాం. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల అవినీతిని, కేసీఆర్ కుటుంబ బండారాన్ని పూర్తిగా ప్రజల ముందుంచి తీరుతాం. ఈ విషయంలో రాజీలేని పోరాటం చేస్తుంది. తిరుమల ఘటన దరద్రుష్టకరం. మనసును తీవ్రంగా కలిచి వేసింది. ఘటన కారణాలపై విచారణ జరుగుతోంది. బాధ్యులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నా.." అని బండి సంజయ్ అన్నారు.


Also Read: Nithya Menen Video: వాళ్లకేమో ముద్దులు, హగ్గులు.. ఫ్యాన్‌తో మాత్రం ఇలా.. నిత్యమీనన్ ప్రవర్తనపై దుమారం.. వీడియో ఇదే..


Also Read: Aadhar Card: మీ ఆధార్‌ కార్డుపై ఎన్ని సిమ్‌ కార్డులు లింక్‌ అయి ఉన్నాయి? ఇలా చెక్‌ చేసుకోండి..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.