Nithya Menen Video: వాళ్లకేమో ముద్దులు, హగ్గులు.. ఫ్యాన్‌తో మాత్రం ఇలా.. నిత్యమీనన్ ప్రవర్తనపై దుమారం.. వీడియో ఇదే..

Nithya menens controversy video: నిత్యమీనన్  ఇటీవల తన ప్రవర్తనతో ఒక్కసారిగా వివాదానికి  కారణమయ్యారు. చెన్నైలో జరిగిన  మూవీ ఈవెంట్ లో అభిమాని ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె మాత్రం.. ఇవ్వకుండా ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారంగా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 10, 2025, 01:57 PM IST
  • రచ్చగా మారిన నిత్యమీనన్ ప్రవర్తన..
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు..
Nithya Menen Video: వాళ్లకేమో ముద్దులు, హగ్గులు.. ఫ్యాన్‌తో మాత్రం ఇలా.. నిత్యమీనన్ ప్రవర్తనపై దుమారం.. వీడియో ఇదే..

Nithya menens shocking behaviour in kadhalikka neramillai movie promotion: నిత్యమీనన్ తన అందంతో పాటు.. నటతో పలు సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మలయాళ భామ.. తెలుగుతో పాటు.. కన్నడ, తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో నటించారు. నిత్య మీనన్..  అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. అంతకు మునుపే బాలనటిగా ఓ ఇంగ్లిష్ సినిమాలో టబుకు చెల్లిగా నటించింది.  

ఇష్క్, గుండె జారీ గల్లింతయ్యిందే, సన్ ఆఫ్ సత్యమూర్తి, కాంచన 2, గీతగోవిందం.. మొదలైన సినిమాల్లో అదిరిపోయే విధంగా నటించారు.  అయితే..ఈ భామ ఇటీవల చెన్నైలో..‘కాదలిక్క నేరమిల్లై’ మూవీ ఈ వెంట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వివాదంగా మారింది.

 

‘కాదలిక్క నేరమిల్లై’ మూవీలో.. జయం రవి హీరోగాను, నిత్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా.. జనవరి 14 న అభిమానుల ముందుకు రానుంది. నిత్యతో పాటు యోగి బాబు, వినయ్, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ తదితరులు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ మూవీ టీమ్ సినిమా ప్రమోషన్  ల స్పీడ్ ను కూడా పెంచింది. ఇటీవల చెన్నైలో కూడా ఒక కార్యక్రమం జరిగింది. అయితే.. ఒక రిపోర్టర్ నిత్య మీనన్ కు అభిమానంలో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ నిత్య మాత్రం..  ‘నా గొంతు సరిగ్గా లేదు. ముందే కోవిడ్ మళ్లీ వస్తుందని అంటున్నారని’  నవ్వుతూ చెప్పింది. దీంతో రిపోర్టర్ మాత్రం కాస్తంత నొచ్చుకున్నట్లు తెలుస్తొంది. అయితే.. కాసేటికే నిత్యమీనన్ మూవీ యూనిట్ హీరోలు, దర్శకుడు.. జయం రవిని హగ్ చేసుకుంది. అదే విధంగా దర్శకుడు.. మిష్కిన్ ను కిస్ పెట్టుకుంది.

Read more: Samantha: పెళ్లికి ముందు చైతును బెదిరించిన సమంత.. వెలుగులోకి షాకింగ్ విషయం.. స్టోరీ ఏంటంటే..?

ఈ నేపథ్యంలో తన అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు మాత్రం.. కరోనా అంటూ ఏదో మాట్లాడి.. ఆ వెంటనే ఇలా ముద్దులు, హగ్ లతో రెచ్చిపొవడం వివాదంగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు నిత్య ప్రవర్తనపై మండిపడుతున్నారు. ఇంత ఆటిట్యూడ్ పనికిరాదంటూ కూడా నిత్యను ఏకీపారేస్తున్నారు. మొత్తానికి ఈ వివాదంతో నిత్య మీనన్ మాత్రం వార్తలలో నిలిచారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News