Kishan Reddy Comments on BRS: బీఆర్ఎస్-కాంగ్రెస్ దొందు దొందే.. ఆ 12 మంది కట్టకట్టుకుని జంప్ అయ్యారు: కిషన్ రెడ్డి
Kishan Reddy Comments in BJP Maha Jan Sampark Abhiyan: గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు కట్టకట్టుకుని బీఆర్ఎస్లో చేరారని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని అన్నారు కిషన్ రెడ్డి. అంబర్పేట్ నియోజకవర్గంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.
Kishan Readdy Comments at BJP Maha Jan Sampark Abhiyan: కాంగ్రెస్‌కు బీఆర్ఎస్కు తేడా లేదని.. రెండు పార్టీలు ఒక్కటేనని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గతంలో ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారని, ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందన్నారు. గురువారం మహాజన్ సంపర్క్ అభియాన్.. ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఆయన అంబర్పేట్ నియోజకవర్గంలో పర్యటించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఈ రోజు ఓ కుటుంబం పాలైందన్నారు. ఆ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటున్నదన్నారు. మాటల గారడీతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం రావాలంటే.. రాష్ట్రం కోసం అమరులైన 1200 వీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే.. బీర్ఎస్ కుటుంబ పార్టీని ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. అవినీతి, నియంతృత్వ, అక్రమాలు చేసే పార్టీని, అధికారం దుర్వినియోగం చేసే పార్టీని ఓడించాలని కోరారు.
"కాంగ్రెస్‌కు.. బీఆర్ఎస్కు తేడా లేదు. గతంలో మనం చూశాం.. ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 12 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఎమ్మెల్సీలు మొత్తం కట్టకట్టుకొని బీఆర్ఎస్లోకి పోయారు. అందుకే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీనే నిలబడుతుంది. బీఆర్ఎస్తో బీజేపీ ఇప్పటి వరకు పెట్టుకోలేదు.. భవిష్యత్‌లో పెట్టుకోదు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నది.. ఢిల్లీలో బీఆర్ఎస్ వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా చేశారు. రాష్ట్రంలో నిజమైన ప్రజాప్రభుత్వం రావాలంటే.. నిజమైన బీఆర్ఎస్ వ్యతిరేక ప్రభుత్వం రావాలంటే అది బీజేపీతోనే సాధ్యం.
Also Read: YS Sharmila: కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల..? జోరుగా ప్రచారం
వందల, వేల కోట్ల రూపాయాలు అక్రమంగా సంపాదించి.. ఆ డబ్బును ఓటర్లకు పంచి ఎన్నికల్లో గెలవాలనే దుర్మార్గపు ఆలోచనతో ఇక్కడి అధికార పార్టీ, కేసీఆర్ ఉన్నారు. డబ్బులతో ప్రజలను ఎక్కువసార్లు మభ్యపెట్టలేరు. గతంలో జరిగిన హుజూరాబాద్, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు అందుకు సాక్ష్యం. నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 9 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించేందుకు, దేశవ్యాప్తంగా బీజేపీ బూత్ కమిటీలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నాయి.." అని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశంలో సుస్థిరమైన, ప్రజలకు అభివృద్ధి చేసి.. దేశ గౌరవం పెంచే ప్రభుత్వం ఉందని చెప్పారు.
Also Read: Bandi Sanjay: సింగిల్‌గానే పోటీ చేస్తాం.. జనసేనతో పొత్తుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి