Kishan Reddy About 2000 Rupees Notes: 2 వేల రూపాయల నోట్లను శాశ్వతంగా రద్దు చేస్తారా ? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Kishan Reddy Comments About 2000 Rupees Notes: అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిపోతున్నా.. దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎరువులపై సబ్సిడీ ప్రకటించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన కిషన్ రెడ్డి... కేంద్రం రైతుల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.
Kishan Reddy Comments About 2000 Rupees Notes and Farmers Issues: అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరిగిపోతున్నా.. దేశంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఎరువులపై సబ్సిడీ ప్రకటించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన కిషన్ రెడ్డి... కేంద్రం రైతుల కోసం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. 2014 ముందు దేశంలో కీలు బొమ్మ ప్రభుత్వం అధికారంలో ఉండేదన్న కిషన్ రెడ్డి.. ఆ సమయంలో ప్రజలు అవినీతి రహిత సమర్థవంతమైన పాలన కొరుకున్నారని అన్నారు. ప్రజలు కొరుకున్నట్టే మోడీ అధికారంలోకి వచ్చారన్నారు. 2014 నుంచి 9 ఏళ్లు నీతివంతమైన, సమర్థవంతమైన పాలన మోడీ అందించారన్నారు కిషన్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయి సమాజం నివ్వెరపోయేలా మోడీ పాలన కొనసాగుతోందన్నారు. దేశంలో ఎప్పటి నుంచో ఉన్న సమస్యలను పరిష్కరించారలని.. అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. రాచపుండులా మారిన ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, రామజన్మ భూమి లాంటి సమస్యలను.. ఒక రక్తపు చుక్క పడకుండా పరిష్కరించారన్నారు కిషన్ రెడ్డి. 2024లో భవ్యమైన రామమందిరం ప్రారంభవం కాబోతోందన్నారు.
"గతంలో జమ్మూ కాశ్మీర్ రావణ కాష్టంలా ఉండేది. మహబూబ్ నగర్ పట్టణంతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో టెర్రరిస్ట్ కార్యకలాపాలను కూకటివేళ్లతో పెకిలించాం. కరోనాను ఎదుర్కొన్నాం. పేద వాడికి బ్యాంకు అకౌంట్ అందించాం. దేశంలో మోడీ పాలనలో డిజిటల్ విప్లవం వచ్చింది. అత్యధిక డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారత దేశంలోనే జరుగుతున్నాయి. నిత్యవసర ధరలు అదుపులో పెట్టాం. కేంద్ర ప్రభుత్వ పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి 42 శాతం చెల్లిస్తున్నాం. ఎరువుల ధరలు పెరుగుతున్నా.. మరో లక్ష కోట్ల రూపాయలు రైతులకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. రైతులకు అదనపు భారం పడకూడదని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎకరానికి రైతుకు 18 వేల 254 రూపాయలు సబ్సిడీ అందుతుంది. అలాగే రైతుకు 6 వేలు అదనంగా అందిస్తున్నాం. పంటల బీమా పథకానికి కొంత ఇస్తున్నాం. తామే ప్రపంచానికి ఆదర్శం అని కొందరు అంటున్నారు. తెలంగాణను ఉద్దరించామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ప్రతీ ఏడాది ఏదో విధంగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోతుంటే తెలంగాణ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. రైతులకు 10 వేల రూపాయలు ఇస్తున్నాం అంటున్నారు. కేంద్రం 18 వేల 254 రూపాయలు సబ్సిడీ రూపంలో రైతులకు అందిస్తోంది. సమగ్ర పంటల బీమ పథకం కేంద్రం అమలు చేస్తోంది. గిట్టుబాటు ధర కల్పిస్తోంది. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో రైతులు అకాల వర్షాలకు రైతులు నష్టపోతే.. కేసీఆర్ చేతులు ముడుచుకుని ప్రగతి భవన్ లో కూర్చున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు డబ్బులు ఇస్తాం అంటున్నారు.. పెట్టుబడి పెడతా తన నాయకత్వాన్ని అంగీకరించండి.. కుటుంబ పార్టీలకు అండగా ఉంటానని కేసీఆర్ అంటున్నారు. విమానాలు కొంటున్నారు. ఆ డబ్బులు ఎక్కడివి ? నాలుగు నెలల్లో ఇల్లు కట్టుకుంటారు. సచివాలయం కడతారు. కాని పేదవారికి ఇళ్లు కట్టే సోయి ఉండదు. 9 ఏళ్లు అవుతోంది. పక్క రాష్ట్రాలు కేంద్రం సహకారంతో లక్షల ఇళ్లు కడుతున్నాయి. పేద వాడికి ఇళ్ల సౌకర్యం కల్పించని రాష్ట్రం ఏదైనా ఉందా అంటే అది తెలంగాణానే. డబుల్ బెడ్ రూమ్ తాము కాబట్టి కడుతున్నామని గతంలో అన్నారు. చెప్పిన మాటలు ఏం అయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ అని మార్చి తెలంగాణ సెంటిమెంట్ ను తొలగించారు." అని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
"2 వేల నోట్లను దశల వారీగా ఉపసంహరించుకుంటారు. గతంలో కూడా అనేకసార్లు నోట్లను ఉపసంహరించుకున్నారు. 31 మార్చి 2018 నుంచి 2 వేల నోట్ల ముద్రణ ఆర్బీఐ ఆపేసింది. చాలా మంది మేధావులు, నిపుణులు 2 వేల నోట్లు రద్దు అయితే బాగుండు అన్నారు. ఇది దేశ భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 30 శాతం కూడా ఇప్పుడు చలామణి కావడం లేదు. కొంతమంది చేతుల్లోనే ఉన్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు సహకరించాలి.. పార్టీ చేరికలు బలపడాలంటే.. గ్రామాల్లో యువత పార్టీలో చేరాలి. బీజేపీ మహా సంపర్క్ యాత్రకు మద్దతు ఇవ్వండి.. ఆశీర్వదించండి.. సహకరించిండి. మోడీ ప్రభుత్వం ప్రజలకు మేలే చేస్తుంది. ఆదుకుంటుంది. పాలమూరు జిల్లా ప్రజలు బీజేపీకి అండంగా ఉన్నారు. గ్రామాల్లోని యువత బీజేపీలోకి రావాలి" అని కిషన్ రెడ్డి అన్నారు.