Kishan Reddy On Minister KTR: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారని కేంద్ర మంత్రి కేటీఆర్ తెలిపారు. అక్టోబర్ 3న నిజామాబాద్ పట్టణంలోని జీజీ గ్రౌండ్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ప్రధాని మోదీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారని చెప్పారు. అక్టోబరు 1న మహబూబ్ నగర్ పట్టణంలో జరిగే బహిరంగ సభలో, 3వ తేదీన నిజామాబాద్ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని అన్నారు. తొలి రోజు పాలమూరు బహిరంగ సభలో పాల్గొని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబరు 3వ తేదీన ఇందూరు పట్టణంలో బీజేపీ బహరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రూ.6 వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌ను మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారని చెప్పారు. బీజేపీ నిజామాబాద్ జిల్లా నాయకత్వంతో పాటు అధికారుల నుంచి సభాస్థలి గురించి పలు సూచనలు స్వీకరించామన్నారు. ప్రధాని మోదీ సభను విజయవంతం చేసేలా జన సమీకరణ సహా ఇతర విషయాలపై పార్టీ నాయకులు, భారత ప్రభుత్వ అధికారులతో చర్చిస్తామన్నారు.


"ఉత్తర తెలంగాణలో హైదరాబాద్ నుంచి మొదలు ఆదిలాబాద్ వరకు భారతీయ జనతా పార్టీ బలోపేతమైంది. ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. గిరిజనులతో పాటు స్థానిక ప్రజలు బీజేపీని ఆదరించి మద్దతు తెలుపుతున్నారు. బీజేపీపై విమర్శలు చేసే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదు. ప్రధాని తెలంగాణ పర్యటన గురించి ప్రశ్నించేందుకు కేసీఆర్ ఎవ్వరు..? ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణకు ఏం చేశారో సమాధానం చెప్పాలి.


రాష్ట్రంలో 17 సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. 17 సార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించలేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని దగా చేసిండు. 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసిండు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు రూ.9 లక్షల కోట్లు ఇచ్చింది. కేటీఆర్‌కు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు.." అని కిషన్ రెడ్డి తెలిపారు. 


Also Read: Chandrababu Case Updates: క్వాష్ పిటీషన్‌పై చంద్రబాబుకు ఊరట, రేపు విచారణకు లిస్టింగ్


Also Read: Oppo Reno 10 5G Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO Reno10 5G మొబైల్‌పై స్పెషల్‌ డీల్‌..రూ. 9,900కే పొందండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి