Hyderabad T20 Match: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఉప్పల్ స్టేడియంలో టీ20 మ్యాచ్!
India vs Australia, Hyderabad To Host T20I Match After 3 Years. కరోనా మహమ్మారి కారణంగా గత రెండున్నరేళ్ల కాలంగా మ్యాచులు లేక వెలవెలబోతున్న ఉప్పల్ స్టేడియంలో ఎట్టకేలకు ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.
Hyderabad will host India vs Australia international T20I match: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. కరోనా మహమ్మారి కారణంగా గత రెండున్నరేళ్ల కాలంగా మ్యాచులు లేక వెలవెలబోతున్న ఉప్పల్ స్టేడియంలో ఎట్టకేలకు ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. 2022 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌లోని మూడో మ్యాచ్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ఖరారు చేసింది.
ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో చివరగా 2019 డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో భారత్ టీ20 మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి మరో మ్యాచ్ జరగలేదు. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020, 2021 యూఏఈలో జరగ్గా.. 2022 అహ్మదాబాద్, ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ 25వ తేదిన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. దాంతో విషయం తెలుసుకున్న ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలానే ఐపీఎల్ మ్యాచులు కూడా జరగాలని కోరుకుంటున్నారు.
ఆస్ట్రేలియా షెడ్యూల్:
సెప్టెంబర్ 20 - మొహాలీ - తొలి టీ20
సెప్టెంబర్ 23 - నాగ్‌పూర్ - రెండో టీ20
సెప్టెంబర్ 25 - హైదరాబద్ - మూడో టీ20
దక్షిణాఫ్రికా షెడ్యూల్:
సెప్టెంబర్ 28 - త్రివేండ్రం - తొలి టీ20
అక్టోబర్ 1 - గౌహతి - రెండో టీ20
అక్టోబర్ 3 - ఇండోర్ - మూడో టీ20
అక్టోబర్ 6 - రాంచీ - తొలి వన్డే
అక్టోబర్ 9 - లక్నో - రెండో వన్డే
అక్టోబర్ 11 - ఢిల్లీ - మూడో వన్డే
Also Read: సూపర్ స్టార్స్ అందరూ గొప్ప నటులు కాదంటూ.. టాలీవుడ్ నెపోటిజంపై సమంత కామెంట్స్!
Also Read: Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్ష సూచన..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook