Samantha Nepotism: సూపర్ స్టార్స్ అందరూ గొప్ప నటులు కాదంటూ.. టాలీవుడ్‌ నెపోటిజంపై సంచలన కామెంట్స్‌ చేసిన సమంత!

Samantha opens up on nepotism in Tollywood at Koffee With Karan 7. 'కాఫీ విత్‌ కరణ్‌' సీజన్‌ 7లో పాల్గొన్న సమంత టాలీవుడ్‌ నెపోటిజంపై సంచలన కామెంట్స్‌ చేశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 22, 2022, 01:59 PM IST
  • సూపర్ స్టార్స్ అందరూ గొప్ప నటులు కాదంటూ
  • టాలీవుడ్‌ నెపోటిజంపై సంచలన కామెంట్స్‌ చేసిన సమంత
  • వారి పిల్లలు మాత్రమే హీరోలు అవుతారు
Samantha Nepotism: సూపర్ స్టార్స్ అందరూ గొప్ప నటులు కాదంటూ.. టాలీవుడ్‌ నెపోటిజంపై సంచలన కామెంట్స్‌ చేసిన సమంత!

Samantha opens up on nepotism in Tollywood at Koffee With Karan 7: బాలీవుడ్‌ పాపులర్‌ షో 'కాఫీ విత్‌ కరణ్‌' ప్రస్తుతం 7వ సీజన్‌ విజయవంతంగా దూసుకుపోతుంది. ఎపిసోడ్ 1లో బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్, అలియా భట్ సందడి చేయగా.. ఎపిసోడ్ 2లో యువ హీరోయిన్స్ జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ హంగామా చేశారు. ఇక ఎపిసోడ్ 3లో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌, స్టార్ హీరోయిన్ సమంత కలిసి సందడి చేశారు. తాజాగా ఎపిసోడ్‌లో అక్షయ్, సామ్ పలు విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలో సమంత టాలీవుడ్‌ నెపోటిజంపై సంచలన కామెంట్స్‌ చేశారు. 

బడా నిర్మాత కరణ్‌ జోహార్ అడిగిన ప్రశ్నలకు అక్షయ్‌ కుమార్‌, సమంతలు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు. విడాకులు, సోషల్ మీడియా వచ్చిన ట్రోల్స్‌పై సామ్ సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే బిగ్‌ బాయ్స్‌ క్లబ్‌, టాలీవుడ్‌ నెపోటిజంపై కరణ్‌ అడగ్గా తన అభిప్రాయం చెప్పారు. 'టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చాలా మంది హీరోల పిల్లలు, వారి బంధువుల పిల్లలు మాత్రమే హీరోలు అవుతారు. విజయ్‌ దేవరకొండ లాంటి వారు స్టార్‌గా మారడం చాలా అరుదు' అని అన్నారు.  

'రెండు ఆపిల్స్‌ ఒక లాగే ఉండవు. ఒక ఆపిల్‌కు మరో ఆపిల్‌కు తేడా ఉంటుందది. నేపో పిల్లలు, నాన్ నెపో పిల్లలు ఎవరైనా ప్రతి ఒక్కరు తమ సొంత ప్రతిభ కలిగి ఉంటారు. ఉదాహరణకు ఒక తండ్రి కోచ్‏గా ఉన్నప్పుడు అతని కుమారుడు గేమ్ ఆడుతున్న సమయంలో అతను పక్కన నిలబడి చూడటం తప్ప.. కొడుకును గెలిచేందుకు ఏం చేయలేడు. ఇక్కడ అంతే. టాలెంట్ ఉంటేనే నేపో పిల్లలు రాణిస్తారు' అని సమంత పేర్కొన్నారు. 

సపోర్ట్‌తో ఇండస్ట్రీలో (ఫస్ట్ మూవ్ అడ్వాంటేజ్) రావడంపై సామ్ స్పందిస్తూ... 'అడ్వంటేజ్‌ అనేది మొదటి సినిమా వరకు మాత్రమే ఉంటుంది. 2-4 సినిమాలకు కూడా ఉండోచ్చు. అంతకంటే ఎక్కువ ఉండదు. నన్ను చూసుకుంటే.. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా సినిమాలు ఫెయిల్‌ అయినా మా అమ్మ నాన్నలకు, సోదరులకు మాత్రమే తెలుస్తుంది. అదే స్టార్‌ హీరో పిల్లలు ఫెయిల్‌ అయితే దేశం మొత్తం తెలిసిపోతుంది. వారసత్వంతో పోలుస్తూ విమర్శలు చేస్తుంటారు. సూపర్ స్టార్స్ అందరూ గొప్ప నటులని, గొప్ప నటులందరూ సూపర్ స్టార్స్ అని నేను అనుకోను.  దేనికైనా దైవానుగ్రహంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రేక్షకులే మనల్సి సక్సెస్ చేసేది' అని సామ్ చెప్పుకొచ్చారు. 

Also Read: CBSE 12th results 2022: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండి ఇలా..

Also Read: JLM Exam: జూనియర్ లైన్‌మెన్ పరీక్షలో మాస్ కాపీయింగ్... పలువురు అభ్యర్థుల అరెస్ట్..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News