Vanama Raghava Arrest: పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న వనమా రాఘవ అరెస్ట్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. వనమా రాఘవను  గురువారం (జనవరి 7) కొత్తగూడెం పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ వనమా రాఘవ ఇంకా పట్టుబడలేదని కొత్తగూడెం పోలీసులు ప్రకటించడం గమనార్హం. దీంతో వనమా రాఘవ అరెస్ట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వనమా రాఘవ (Vanama Raghava) అరెస్టు కోసం ప్రస్తుతం 8 బృందాలు గాలిస్తున్నట్లు పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ అతని కోసం వెతుకుతున్నట్లు తెలిపారు. వనమా రాఘవ పట్టుబడితే అతన్ని కస్టడీలోకి తీసుకుంటామని... తగిన ఆధారాలు లభిస్తే రౌడీ షీట్ నమోదు చేస్తామని తెలిపారు. గతంలో రాఘవపై నమోదైన కేసుల ఆధారాలను పరిశీలిస్తామన్నారు. 


పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు (Palvancha family suicide case) పాల్పడి నాలుగు రోజులు గడిచింది. ఇప్పటివరకూ నిందితుడు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు, ప్రభుత్వం అతనికి సహకరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వనమా అరెస్టుకు అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో గురువారం అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అతన్ని కొత్తగూడెంకు తరలిస్తున్నట్లు వార్తా కథనాలు వచ్చాయి. కానీ ఇంతలోనే కొత్తగూడెం పోలీసులు షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. వనమా రాఘవ ఇంకా పట్టుబడలేదని ప్రకటించడంతో ఈ వ్యవహారంపై ఒకింత గంరదగోళం నెలకొంది.


నాగ రామకృష్ణ ఆత్మహత్య కేసులో తనపై ఆరోపణలను వనమా రాఘవ ఇప్పటికే తోసిపుచ్చారు. దీనిపై మరోసారి వివరణ ఇచ్చేందుకు రాఘవ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశానికి కూడా సిద్ధమయ్యారు. ఇంతలో పోలీసులు అతన్ని అడ్డుకుని అదుపులోకి (Vanama Raghava Arrest) తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పటికీ కొత్తగూడెం ఎస్పీ నుంచి అరెస్టుపై అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ రాఘవ అరెస్టయ్యాడనే అంతా భావించారు. కానీ ఇంతవరకూ అతను పట్టుబడలేదని పోలీసులు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 


Also Read: Gold Price Today January 7 2022 : తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి