Vemulavada Temple: వేములవాడ వెళ్లే రాజన్న భక్తులకు గుడ్ న్యూస్
Vemulavada Temple Dharmagundam: దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో ముందుగా పవిత్రమైన ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే పాపాలన్నీ మటుమాయం అవుతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసం.
Vemulavada Temple Dharmagundam: గత మూడు సంవత్సరాలుగా భక్తులకు పవిత్ర స్నానం ఆచరించడానికి వీలు లేకుండా మూసి ఉన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలోని ధర్మగుండం ఆదివారం పునఃప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఆలయ వేద పండితులు ప్రత్యేకంగా ధర్మగుండం వద్ద పునప్రారంభ పూజ నిర్వహించి, పుణ్యవచనము చేసి మొదటగా ధర్మగుండం నీళ్లతో స్వామి వారికి అభిషేకం చేసి ఆ తరువాత భక్తులను పవిత్ర స్నానాలకు అనుమతించారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూడు సంవత్సరాల క్రితమే ఈ ధర్మగుండం మూసేసింది. ధర్మగుండం భక్తుల, అధ్యాత్మక వ్యక్తుల కోరిక మేరకు దేవాదాయ, ధర్మదాయా శాఖ వారు స్పందించి ఎట్టకేలకు ఈ రోజు నుండీ భక్తులకు పుణ్య స్నానాల మోక్షం కలగించారు. గత 15 రోజులుగా ఆలయ సిబ్బంది ధర్మగుండంను శుద్ధి చేసి, కలర్లు వేసి, నిండుగా నీళ్లు రింపి భక్తులకు పుణ్యస్నానాలకు ఏర్పాట్లుచేశారు
దీనితో భక్తులకు పవిత్ర పుణ్యస్నానాల మోక్షం కలిగినట్లైంది.
దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద శైవక్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో ముందుగా పవిత్రమైన ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకుంటే పాపాలన్నీ మటుమాయం అవుతాయని భక్తుల ప్రఘాడ విశ్వాసం. ఈ ధర్మగుండముకు అలాంటి ఒక చరిత్ర కూడా ఉంది.
అలనాడు హరిహరమహారాజు అనే వ్యక్తి శాపగత్తుడై కుష్టి రోగంతో అడవి, గుట్టలు తిరుగుతూ అప్పటి లేములాడ అనే పిలువబడే ఇప్పటి ఈ వేములవాడ కు చేరుకోను గుడి ముందున్న చెట్టు కింద కూచొని బాధపడుతుంగా, గజ్జితో ఉన్న కుక్క వచ్చి ఇప్పటి ఈ ధర్మగుండం అప్పుడు చిన్న కోనేరు గా ఉండే, ఈ కొనేరులో ఆ గజ్జితో ఉన్న కుక్క స్నానం చేయడంతో గజ్జి మాయమైన ఆ కుక్క చూసి ఆశ్చర్యపోయాడు. అది చూసిన హరిహరిమహారాజు ఇదేదో మాయకొనేరు ఉందని రాజుకుడా ఈ ధర్మగుండంలో మూడు సార్లు మునిగి లేచ్చేసారికి శాపంతో ఉన్న కుష్టిరోగం మాయమైంది అని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుండి ఈ క్షేత్రాన్ని హరిహారక్షేత్రం గా పిలువబడుతుంది. ఆనాటి నుండి ఈ ధర్మగుండం లో స్నానాలు చేస్తే పాపాలతో పాటు దీర్ఘకాలిక రోగాలు పోతాయని భక్తుల నమ్మకము.