Aleti Maheshwar Reddy: రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో ఉండడు. 2025లో తెలంగాణకు కొత్త సీఎం?
Aleti Maheshwar Reddy Speech About Wedding: తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రానున్నాడా? రేవంత్ రెడ్డి పదవి హుష్ కాకినా? తదితర సంచలన విషయాలను బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
Aleti Maheshwar Reddy: రోజురోజుకు వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కొనసాగలేడని.. 2025లో అతడు దిగిపోయి మరో వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని బీజేపీ ఫైర్ బ్రాండ్ ఏలెటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తెలంగాణతోపాటు ఢిల్లీలోని రేవంత్‌కు అన్ని దారులు మూసుకుపోయానని వివరించారు. ప్రభుత్వంలోనూ.. రాజకీయాలపరంగానూ రేవంత్‌కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Also Read: Bandi Sanjay: కేటీఆర్, రేవంత్ రెడ్డి చేయాల్సింది పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర
హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం సహకరించడం లేదని.. రేవంత్ రెడ్డికి రాహుల్, సోనియా గాంధీకి మధ్య దూరం పెరిగిందని తెలిపారు. 'ఢిల్లీలో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. 2025 జూన్ నుంచి డిసెంబర్ లోగా కొత్త ముఖ్య మంత్రి తెలంగాణకు రాబోతున్నారు' అని సంచలన ప్రకటన చేశారు.
'కేరళలో ప్రియాంక గాంధీ నామినేషన్ వేసేటప్పుడు వెళ్లిన రేవంత్ రెడ్డిని ఎవరూ. కలవలేదు. ఢిల్లీలో మూడుసార్లు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఖాళీగా తిరిగి వచ్చారు. ఈ అంశంపై పక్క అధరాలు నా దగ్గర ఉన్నాయి' అని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వివరించారు. మూసీ అంశాన్ని ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు అధిష్టానానికి చెప్పారని వెల్లడించారు.
మూసీ ప్రాజెక్టు వ్యయాన్ని మూడు రెట్లు పెంచిన తరువాత అవినీతి బయటపడింది. రేవంత్ ఏకపక్ష ధోరణిని సీనియర్ మంత్రులు గుర్రుగా ఉన్నారు. జూన్ నుంచి డిసెంబర్‌లోపు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయం' అని ప్రకటించి ఎమ్మెల్యే ఏలేటి సంచలనం రేపారు. తాను అనవసర మాటలు మాట్లాడనని.. పూర్తి అధ్యయనం చేసిన తర్వాతనే మాట్లాడుతానని మరోసారి స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్యే ఏలేటి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర కలకలం రేపాయి. ఇప్పటికే రేవంత్‌ను వ్యతిరేకిస్తున్న వారికి ఇది ఒక పావుగా వాడుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్‌ను ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్ని రోజులు ఆపుతారని? ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి