మీకూ ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయా ? ఐతే జాగ్రత్త !
పేటీఎం కేవైసీ చేయించుకోవాలని, బహుమతులు వచ్చాయని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నా.. చాలామంది పౌరుల్లో మాత్రం ఇప్పటికీ సరైన అవగాహన రావడం లేదని నిరూపించే ఘటనలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉన్నాయి.
హైదరాబాద్: పేటీఎం కేవైసీ చేయించుకోవాలని ( Paytm KYC ), బహుమతులు ( Gifts, lotteries) వచ్చాయని నమ్మించి మోసం చేస్తున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నా.. ఇప్పటికీ చాలామంది పౌరుల్లో సైబర్ నేరాలపై ( Cyber crimes) సరైన అవగాహన రావడం లేదని నిరూపించే ఘటనలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉన్నాయి. మాయమాటలు చెబుతూ వచ్చే స్పామ్ ఫోన్ కాల్స్, ఫిషింగ్ మెసెజెస్, లాటరీ ఈమెయిల్స్ నమ్మి మోసపోవద్దని పదేపదే పోలీసులు చెబుతున్నా.. ఇప్పటికీ కొంతమంది జనం సైబర్ నేరగాళ్ల బుట్టలో పడి మోసపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌కి చెందిన పలువురు పౌరుల నుంచి ఇదే తరహాలో సైబర్ నేరగాళ్లు రూ.12 లక్షలకుపైగానే స్వాహా చేశారు. Also read: ఆర్తి అగర్వాల్‌పై బయోపిక్
మీరు బహుమతి గెల్చుకున్నారని నమ్మించిన కేటుగాళ్లు.. బేగంబజార్‌కు చెందిన వ్యక్తి నుంచి రూ.2.60 లక్షలు టోకరా వేశారు. లంగర్ హౌజ్‌కి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి ఫోన్ చేసిన సైబర్ నేరస్తులు.. మీ డెబిట్ కార్డు ( Debit card ) బ్లాక్ అవబోతుందంటూ చెప్పారు. తాము చెప్పినట్టుగా చేస్తే ఆ సమస్య నుంచి బయటపడొచ్చంటూ అతడి నుంచే ఓటీపీ ( OTP ) తెప్పించుకుని మరీ అతడి ఖాతాలో ఉన్న రూ. 3 లక్షలు కాజేశారు. ఆన్‌లైన్ షాపింగ్‌లో ( Online shopping ) డ్రస్ మెటీరియల్ కొనేందుకు యత్నించిన ఓ మహిళను ఆన్‌లైన్‌లోనే ట్రాప్ చేసిన సైబర్ నేరస్తులు.. ఆమె నుంచి 1.3 లక్షలు లూటీ చేశారు. Also read: COVID-19: మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
ఆన్‌లైన్‌లో లక్ష రూపాయల లోన్ ఇచ్చే వారికోసం సెర్చ్ చేస్తోన్న వ్యక్తి గురించి తెలుసుకున్న కేటుగాళ్లు.. అతడికి రుణం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి అతడి నుంచి రూ లక్ష స్వాహా చేశారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో గూగుల్ పే కస్టమర్ కేర్ నెంబర్ ( Google pay customer care ) కోసం వెతుకుతున్న వ్యక్తి నుంచి రూ. 2.60 లక్షలు హోంఫట్ అనిపించారు. మరో ఘటనలో మరో వ్యక్తి నుంచి రూ. 2.40 లక్షలు నొక్కేశారు. Also read: అర్ధరాత్రి ప్యాంట్‌లో ఏదో కదులుతోందని చూసి షాకయ్యాడు.. వైరల్ వీడియో
సైబర్ నేరగాళ్ల ( Cyber criminals ) చేతుల్లో మోసపోయాకే తేరుకున్న బాధితులు చివరకు చేసేదేం లేకపోవడంతో చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. అలా మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన బాధితులు అందరూ కలిసి పోగొట్టుకున్న మొత్తం రూ.12 లక్షలు పైమాటేనని సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. Also read: Mystery Seeds: చైనా నుంచి విత్తనాల కొరియర్లు.. చైనా మరో కుట్ర చేస్తోందా ?