Mystery Seeds: చైనా నుంచి విత్తనాల కొరియర్లు.. చైనా మరో కుట్ర చేస్తోందా ?

అమెరికా, కెనడాలో గత కొద్ది రోజులుగా కొంత మంది పౌరులకు చైనా నుంచి గుర్తుతెలియని విత్తనాల ప్యాకెట్స్ ( Mystery seeds ) వస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు.. ఆ విత్తనాల ప్యాకెట్స్ తెరవొద్దని.. వాటిని నాటొద్దని హెచ్చరిస్తున్నారు.

Last Updated : Aug 4, 2020, 02:41 PM IST
Mystery Seeds: చైనా నుంచి విత్తనాల కొరియర్లు.. చైనా మరో కుట్ర చేస్తోందా ?

అమెరికా, కెనడాలో గత కొద్ది రోజులుగా కొంత మంది పౌరులకు చైనా నుంచి గుర్తుతెలియని విత్తనాల ప్యాకెట్స్ ( Mystery seeds ) వస్తుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న అక్కడి అధికారులు.. ఆ విత్తనాల ప్యాకెట్స్ తెరవొద్దని.. వాటిని నాటొద్దని హెచ్చరిస్తున్నారు. పారదర్శకమైన వైట్ కవర్లలో వస్తున్న ఈ విత్తనాల ప్యాకెట్స్‌పై చైనా పోస్ట్ ( China post ) అని చైనీస్ అక్షరాలలో రాసి ఉండటమే ఈ అనుమానాలకు కారణమైంది. అమెరికాలో వాషింగ్టన్ నుంచి వర్జీనియా వరకు అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఎంతో మందికి ఈ విత్తనాల ప్యాకెట్స్ వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆ మిస్టరీ సీడ్స్ ఓపెన్ చేయకూడదని, వాటిని నాటకూడదని అమెరికా వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. విత్తనాలు నాటితే మొలిచే మొక్కలు ఇతర పంటలపై దుష్ప్రభావం ( invasive plant species ) చూపించే ప్రమాదం లేకపోలేదని.. అందుకే అవి నాటి ఇబ్బందులు పడొద్దంటూ విత్తనాల ప్యాకెట్స్ అందుకున్న వారిని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. Also read: SSR death case: మహా సర్కార్‌కి బీహార్ సర్కార్ నుంచి మరో షాక్

ఎవరికైతై ఈ విత్తనాలు వచ్చాయో.. వారి దగ్గరి నుంచి ఆ విత్తనాలను సేకరిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు... అవి ఏ జాతికి చెందిన విత్తనాలో తెలుసుకునే దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఆ విత్తనాలు మరో కొత్త రకం వైరస్ లేదా బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని కొంతమంది నిపుణులు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. అసలే కరోనావైరస్ ( Coronavirus ) పుట్టుకకు చైనానే కారణం అని ఆరోపిస్తున్న అమెరికాలో ఇలాంటి ఘటనలు ఎదురైతే  ఇంకేమైనా ఉందా ? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊరుకుంటారా ? అందుకే ఈ విత్తనాలు ఏంటో ఏమో అని తెలుసుకునేందుకు అక్కడ పెద్ద పరిశోధనే జరుగుతోంది.  Also read: Ram mandir: భూమి పూజ తొలి ఆహ్వానం అందుకుంటున్న ఇక్బాల్ ఎవరు ?

Trending News