MLC Kavitha: విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి..కవిత ఇంట్లో వినాయక చవితి ఉత్సవాలు..!
MLC Kavitha: దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనం జరిగాయి. ఉత్సవాల్లో ఎమ్మెల్సీ కవిత, అనిల్ దంపతులతోపాటు కుమారుడు ఆర్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వినాయకుడిని వేడుకున్నట్లు తెలిపారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి వీధిలో గణేష్ మండపాలు వెలిశాయి. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేషుడికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెడుతున్నారు. ఇటు తెలంగాణలో ప్రతి చోటా వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. భక్తి శ్రద్ధలతో గణేషుడిని పూజిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్న ఖైరతాబాద్ వినాయకుడు పంచముఖ మహాలక్ష్మీ గణపతిని భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఖైరతాబాద్ వినాయకుడికి గవర్నర్ తమిళిసై తొలి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈసారి ఖైరతాబాద్ గణేషుడు 50 అడుగులుగా కనిపిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా వినాయకుడి విగ్రహంతోపాటు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, మహా గాయత్రి దేవి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో పోలిస్తే ఈసారి పరిస్థితి మారిపోయింది. మట్టి విగ్రహాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మట్టి విగ్రహాలను ఎక్కువగా ఉపయోగించాలని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విస్తృత ప్రచారం నిర్వహించారు. దీంతో భక్తులంతా మట్టి వినాయకుడిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఇటు ప్రభుత్వాలు సైతం ఉచితంగా పంపిణీ చేశాయి.
Also read:Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశ్‌ని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్..
Also read:నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా.. ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటా: మహేష్ బాబు
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి