Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశ్‌ని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. గణనాథుడికి తొలి పూజ..

Ganesh chaturthi : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సందర్భంగా తొలి పూజ చేశారు.

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 31, 2022, 12:14 PM IST
  • నేడు గణేశ్ చతుర్థి
  • దేశవ్యాప్తంగా ఘనంగా గణపతి ఉత్సవాలు
  • ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తమిళిసై తొలి పూజ
 Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశ్‌ని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. గణనాథుడికి తొలి పూజ..

Ganesh Chaturthi 2022 Governor Tamilisai Visits Khairatabad Ganesh: నేడు గణేశ్ చతుర్థి కావడంతో దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాల కోలాహలం మొదలైంది. దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతీ చోటా వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. భక్తి శ్రద్ధలతో భక్తులు ఆ గణనాథుడిని దర్శించుకుంటున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హైదరాబాద్ ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన పంచముఖ మహాలక్ష్మి గణపతిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పంచముఖ మహాలక్ష్మి గణపతికి గవర్నర్ తొలి పూజ చేశారు.గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌తో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖైరతాబాద్ గణేశుడిని సందర్శించుకున్నారు. 

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణపతి ఎంతో స్పెఫల్ అనేది అందరికీ తెలిసిందే. ఈసారి పూర్తిగా మట్టితో చేసిన 50 అడుగుల గణపతి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. వినాయకుడి విగ్రహంతో పాటు షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి, మహాగాయత్రి దేవి విగ్రహాలను ఏర్పాటు చేశారు. తొలి రోజు గణనాథుడిని చూసేందుకు ఖైరతాబాద్‌కు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

గతంతో పోలిస్తే ఈసారి మట్టి విగ్రహాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మట్టి విగ్రహాల ద్వారా పర్యావరణానికి ఎలాంటి హానీ కలగదు. మట్టి విగ్రహాల్లో మట్టితోపాటు కర్రలు, బంకమన్ను, కాటన్ బట్టను పయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తోనే కాదు మట్టితో తయారుచేసిన భారీ విగ్రహాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మంటపాల్లో కూడా అక్కడక్కడా మట్టి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి.

Also Read: Ganesh Chaturthi 2022: బొజ్జ గణపయ్యకు అత్యంత ఇష్టమైన 5 పదార్థాలివే.. ఇవి నైవేద్యంగా పెడితే గణనాథుడి అనుగ్రహం తప్పక పొందుతారు..

Also Read: Vinayaka Chavithi: వినాయకుడిని ఎన్ని రకాల పత్రాలతో పూజిస్తారో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News