హైదరాబాద్: ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లంతా ఓటేసిన అనంతరం ఎడమ చేతి చూపుడు వేలుని పైకెత్తి చూపించేవారు. కానీ త్వరలోనే తెలంగాణలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన అనంతరం ఓటు హక్కు వినియోగించుకున్నదానికి సంకేతంగా వేలెత్తి చూపించాల్సి వస్తే, ఎడమచేతి మిడిల్ ఫింగర్ చూపించాల్సిందే. అందుకు కారణం ఓటర్ల వేలికి సిరా చుక్క పెట్టే విధానంలో ఎన్నికల సంఘం మార్పులు చేయడమే. అవును, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ ఎడమచేతి చూపుడు వేలుకే సిరాను అంటించడం చూశాం. కానీ రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎడమ చేతి మిడిల్ ఫింగర్‌కు సిరా గుర్తు పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈమేరకు రిటర్నింగ్, ప్రొసిడింగ్, అసిస్టెంట్ ప్రొసిడింగ్స్‌ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు సైతం జారీ అయ్యాయి.