Azmeera Seetaram Naik: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కమలం పార్టీకి మంచి ఆదరణ ఉంది. ఆ పార్టీని ఓరుగల్లు ప్రజలు అనేక సార్లు ఆదరించారు. గతంలో హన్మకొండలో బీజేపీ ఎంపీ గెలిచారు. అటు ఓరుగల్లు పీఠంపై కాషాయ జెండా ఎగిరింది.. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కమలం పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 చోట్ల కాషాయ పార్టీ మూడో స్ధానానికి పరిమితం అయ్యింది. ఒక్కరంటే ఒక్కరూ మాత్రమే రెండు ప్లేస్‌లో నిలిచారు. అదికూడా ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌రావు. అయితే పార్టీకి ఈ స్థాయిలో రిజల్ట్స్‌ రావడం వెనుక పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గపోరే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అందుకే పార్టీ ఓరుగల్లు జిల్లాలో కమలం పార్టీ డీలా పడిందని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారని సమాచారం. మరోవైపు పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న నేతల్ని కాదని వలస వచ్చిన నేతలకే పదవులు దక్కతున్నాయనే అసంతృప్తిలో జిల్లా నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు జిల్లాలో ఆధిపత్య పోరు తట్టుకోలేక వలస వచ్చిన కొందరు నేతలు తిరిగి సొంతగూటికి చేరుకునే ప్రయత్నం మొదలు పెట్టినట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి అశించినా స్థాయిలో సీట్లు రాలేదు. అటు వర్ధన్నపేట నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తనకు వరంగల్ ఎంపీ సీటు కావాలని ఆరూరి పట్టుబట్టారు. దాంతో గులాబీ బాస్‌ టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. ఓడిన నేతకే మరోసారి టికెట్ ఇచ్చి చేతులు కాల్చుకోవడం ఏంటని ఉద్దేశంతోనే టికెట్‌ ఇవ్వలేదు.. కానీ తనకు టికెట్‌ దక్కలేదన్న అసంతృప్తిలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ బీజేపీలోకి జంప్‌ కొట్టారు. ఆ తర్వాత కమలం పార్టీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా మారిపోయారు. కానీ ప్రజలు మాత్రం ఆరూరికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆరూరికి మూడోస్థానానికి పరిమితం చేశారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్‌ అయ్యారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌. అంతేకాదు పార్టీలో తనకు ఆశించినా స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదని.. అందుకే సొంత గూటికి చేరుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.


మరోనేత మహబూబాబాద్‌ మాజీ ఎంపీ సీతారాం నాయక్‌కు ఇదే కథ..! గతంలో మహబూబాబాద్ బీఆర్ఎస్‌ ఎంపీగా ఆయన పనిచేశారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో సీతారాం నాయక్‌ కు కేసీఆర్‌ టికెట్‌ ఇవ్వరనే ముందుస్తు సమాచారంతో ఆయన కమలం పార్టీలో చేరిపోయారు. కానీ ఎన్నికల్లో సీతారాం నాయక్‌ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇప్పుడు కాషాయ పార్టీలో కొనసాగుతున్న పెద్దగా ప్రాధాన్యత లేదనే అసంతృప్తిలో ఉన్నారట. దాంతో పార్టీ మారాలని డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల తనకున్న పాత పరిచాయాల ద్వారా గులాబీ బాస్‌కు వద్దకు సమాచారం వెళ్లేలా చేశారట. అయితే సీతారాం నాయక్‌, ఆరూరి రమేష్‌ చేరిక విషయంలో గులాబీ పార్టీ ఆచీతూచీ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని గులాబీ పార్టీ వర్గాలు అంటున్నాయి..


వాస్తవానికి వరంగల్ జిల్లాలో కమలం పార్టీ లీడర్లలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నట్టు సమాచారం. జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్‌, కిషన్ రెడ్డి పర్యటనల సమయంలో అంతా కలిసి ఉన్నామని కలరింగ్ ఇస్తున్నా.. ఆ తర్వాత పాత సీన్‌ రిపీట్‌ అవుతోందట. అయితే పార్టీలో అంతర్గత కుమ్ములాటలపై కేంద్రమంత్రి, పార్టీ ప్రెసిడెంట్ కిషన్‌ రెడ్డి ఏమీ పట్టన్నట్టు వ్యవరిస్తున్నారట. కానీ బండి సంజయ్ మాత్రం వరంగల్‌ జిల్లాలోని కొద్ది ప్రాంతం తన కరీంనగర్‌ పార్లమెంటు పరిధిలోకి వస్తుండటంతో.. పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వరంగల్‌ జిల్లాకు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కేటాయిస్తున్న నేతలు మాత్రం తమకు అనుకూలంగా మార్చుకోలేకపోతున్నారని జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా పార్టీలో రాజకీయాలు తారాస్థాయికి చేరుకోవడంతో వలస నేతలతో పాటు కొందరు సీనియర్‌ నాయకులు కూడా తీవ్ర ఉక్కపోతకు గురై.. పార్టీ మారడమే బెటరనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.


Also Read:  Chittur Politics: పాలిటిక్స్‌కు ప్యాకప్‌.. ఓన్లీ మేకప్‌


Also Read: BRS POLITICS: అలంపూర్‌ ఎమ్మెల్యే యూటర్న్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.