RK ROJA: వైసీపీ లీడర్ మాజీమంత్రి ఆర్కే రోజా ఓ ఫైర్ బ్రాండ్ లీడర్.. వైసీపీ సర్కార్ అధికారంలో ఉండగా.. మంత్రి పదవి చేపట్టి తల కలను సాకారం చేసుకున్నారు. తాము అధికారంలో ఉండగా.. ఎదురేలేదు అన్నట్టు ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగత దూషణలతో తిట్టిపోశారు. అప్పట్లో ఆమెకు వైసీపీ హైకమాండ్ నుంచి పూర్తి స్వేచ్ఛ దొరకడంతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. దాదాపు ఐదేళ్లు కూటమి పార్టీలోని నేతలందర్నీ ముప్పుతిప్పులు పెట్టిన రోజా.. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీసీ ఓడిపోవడంతో పత్తా లేకుండా పోయారు. అంతేకాదు ఇప్పుడామే తిరిగి సినిమాల్లో నటించేందుకు సిద్దమైన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఆర్నెళ్ల క్రితం వైసీపీ అధికారం కోల్పోయాక.. చాలామంది లీడర్లు పత్తా లేకుండా పోయారు. ఇందులో ఆర్కే రోజా కూడా ఒకరు.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పదేళ్లు చక్రం తిప్పిన రోజాకు.. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సొంత పార్టీ లీడర్లే షాక్ ఇచ్చారు. పరోక్షంగా వీరంతా రోజా ఓటమికి కారణం కూడా అయ్యారు. అయితే సొంత పార్టీ లీడర్లే తనను ఓడగొట్టారన్న సమాచారంతో రోజా నగరి నియోజకవర్గానికి ముఖం చాటేశారని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ హైమాండ్ ఆదేశాల మేరకు అప్పుడప్పుడు చుట్టపుచూపుగా నియోజకవర్గానికి వచ్చిపోతున్నట్టు తెలిసింది. మరోవైపు గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌పై ఎగిరి గంతేసినా రోజా.. ఇప్పుడు ఆ నేతల పేర్లు చెప్పేందుకు వణికిపోతున్నారట. ఇందుకు ప్రధాన కారణం కేసుల భయమేనన్న ప్రచారం జరుగుతోంది.
ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజాపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో భూ దందాలు, క్రీడా పోటీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రస్తుత కూటమి సర్కార్ కేసులు నమోదు చేసింది. ఇప్పుడు ఆ కేసులను ఏపీ సీఐడీ విచారిస్తోంది. ఈ కేసుల భయం రోజాకు పట్టుకుందని అంటున్నారు. అందుకే ప్రభుత్వ పెద్దలుగా ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శించేందుకు భయపడుతున్నారట. పార్టీ పెద్దలు తప్పక ప్రెస్‌మీట్ పెట్టాలని ఆదేశాలు వస్తేగానీ బయటకు రావడం లేదని చెబుతున్నారు. అయితే కేసుల భయంతోనే రోజా యూటర్న్ తీసుకుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు రోజా సినిమాలకు ఫ్యాకప్ చెప్పేసి.. మేకప్ వేసుకోవాలని డిసైడ్ అయ్యారట. వెండితెరతో పాటు.. బుల్లితెర మీద మెరిసేందుకు సిద్దమయ్యారట. ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్న రోజా.. అటు కోలీవుడ్‌లోనూ క్యారక్టర్‌ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు డైరెక్టర్లతో సంప్రదింపులు కూడా జరిపారని త్వరలోనే రోజా సినిమాల్లో మరోసారి మెరుపులు మెరిపించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.
మొత్తంగా రోజా సినిమాల్లో బిజీబిజీ అయితే నగరిలో పరిస్థితి ఏంటనే చర్చ పార్టీలో జరుగుతోందట. ఇప్పటికే నగరి నియోజకవర్గానికి రోజా ముఖం చాటేయడంతో పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ నాయుడు వైసీపీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఇప్పుడు రోజా కూడా దూరం అయితే తమ పరిస్థితి ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తోందట. అయితే రోజా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే మాత్రం.. నగరికి కొత్త ఇంచార్జ్‌గా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు..
Also Read: Congress Politics: కేబినెట్ విస్తరణకు బ్రేక్.. అడ్డుపడిన నల్గొండ లీడర్
Also Read: Nagababu: మెగా బ్రదర్ బంపరాఫర్.. కేబినెట్‌లో నాగబాబు శాఖ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.