TS SSC Paper Leak Case: 10వ తరగతి పేపర్ లీక్ ఘటనపై బండి సంజయ్‌పై ఆరోపణలు
Warangal CP Ranganath Press meet in SSC Paper Leak Case: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 10వ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీక్ అవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండో రోజు కూడా పదో తరగతి ప్రశ్న పత్రం లీకైందన్న సంచలన వార్త అటు విద్యార్థులను, ఇటు వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
Warangal CP Ranganath Press meet in SSC Paper Leak Case: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 10వ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీక్ అవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండో రోజు కూడా పదో తరగతి ప్రశ్న పత్రం లీకైందన్న సంచలన వార్త అటు విద్యార్థులను, ఇటు వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. రెండో రోజు క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన మైనర్ యువకులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన వరంగల్ పోలీసు కమిషనర్ రంగనాథ్.. తాజాగా ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జామ్ 9.30 కి మొదలవగా 9.45 గంటలకు ప్రశ్న పత్రాన్ని ఫోటో తీశారని.. ఆ తరువాత 9.46 గంటలకు పేపర్ బయటికొచ్చిందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు.
ఈ సందర్భంగా వరంగల్ సీపీ రంగనాథ్ మాట్లాడుతూ.. " ప్రశ్న పత్రం పేపర్ లీక్ అయిన తీరు చూస్తే.. పేపర్ ఫోటో తీసింది 9.45 గంటలకు కాగా.. 9.30 గంటలకే పేపర్ లీకైంది అని చాటింగ్ చేసుకోవడం, ఒక జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన తీరు చూస్తే.. ఉద్దేశపూర్వకంగా పేపర్ లీక్ ఘటనను వాడుకోవాలని చూసినట్టు అర్థమవుతోంది" అని అన్నారు. పరీక్ష హాలులోకి వెళ్లిన విద్యార్థులకు నకలు చిట్టీలు అందించడానికో లేక ఇన్విజిలేటర్ ద్వారా విద్యార్థులకు సమాధానాలు చేరవేయడానికో ఉపయోగపడుతుందే తప్ప మొత్తం పేపర్‌ని పేపర్ లీక్ చేసి జవాబులు సిద్ధం చేసుకునే రకం పేపర్ లీకేజీ మాత్రం కాదని సీపీ రంగనాథ్ పేర్కొన్నారు.
ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టిసెస్ ఇన్ ది ఎగ్జామినేషన్స్ యాక్ట్, సెక్షన్ 5 కింద కమలాపూర్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఒక బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. శివ గణేష్ అనే మరో యువకుడిని అరెస్ట్ చేశాం. అలాగే ప్రశాంత్ అనే మరొక జర్నలిస్టును కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
టెన్త్ క్లాస్ పేపర్ లీకైందని విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన, అలజడి సృష్టించేలా ఈ పేపర్ లీక్ ఘటన జరిగినట్టుగా ఘటన జరిగిన తీరుతెన్నులు చూస్తే అర్థం అవుతోందని సీపీ రంగనాథ్ మీడియాకు తెలిపారు. పరీక్షల నిర్వహణపై దురుద్దేశపూర్వకంగా వేలెత్తి చూపేలా చేయడం కోసమే నిందితులు ఈ పని చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. ఇదే విషయాన్ని చార్జ్‌షీట్‌లో పొందుపర్చి కోర్టుకు విన్నవిస్తాం అని అన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడిస్తూ.. ప్రశ్నపత్రం లీక్ అయిందనే వార్తకు సంబంధించిన మెసేజ్‌లు హైదరాబాద్‌లో ఉన్న మీడియా బ్యూరో చీఫ్స్‌తో పాటు బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూడా ఫార్వార్డ్ అయ్యాయని వరంగల్ సీపీ రంగనాథ్ స్పష్టంచేశారు. అయితే, ఎవరైతే ఈ మొత్తం తతంగానికి పాల్పడ్డారో.. వారిలో ఒక యువకుడికి బండి సంజయ్‌తో పరిచయం ఉండటం, బండి సంజయ్‌తో అతడు కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఉండటంతో ఈ ఘటనపై ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ సర్కారుపై బురద జల్లేందుకు ఇది బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆడిస్తున్న నాటకం అంటూ మంత్రులు, నేతలు మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి : TS Tenth Exams: టెన్త్ పేపర్ల లీక్‌పై ప్రభుత్వం సీరియస్.. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్
ఇది కూడా చదవండి : TS 10Th Class Exams Paper Leak: అటెండర్ నెత్తిన 10వ తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK