Warangal Police Notice To Ys Sharmila: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం నుంచి 10 రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగేలా పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయగా.. చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. పాదయాత్రకు అనుమతి ఎందుకు ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారని వైఎస్సార్టీపీ పార్టీ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోర్డు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం లింగగిరి గ్రామం వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి పాదయాత్ర ప్రారంభించేలా రూట్ మ్యాప్ సైతం సిద్ధమైందని ఆ పార్టీ నేతలు చెప్పారు. అయితే కోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా అనుమతి ఇవ్వాల్సిన వరంగల్ పోలీసులు చివరి నిమిషం వరకు ఎదురు చుసే ధోరణిగా వ్యవహరించి పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వాలో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారని తెలిపారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లు బూచిగా చూపెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. 


ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న పాదయాత్రను అడ్డుకొనే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తే.. తమ పార్టీ నిబంధనలను ఉల్లంఘించిందంటూ కొత్త నాటకానికి పోలీసులు తెరలేపారని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. పాదయాత్రను అడ్డుకునే విధంగా కుట్రలు జరిగినా.. ఈ అంశంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ న్యాయ పరంగా నోటీసులకు వివరణ ఇస్తుందన్నారు.  కోర్ట్ ఆదేశాలను గౌరవిస్తూ ఆదివారం ఒక్క రోజు  పాదయాత్రకు విరామం ప్రకటించినట్లు తెలిపారు. 


వరంగల్ పోలీసులకు న్యాయబద్ధంగా వివరణ ఇస్తామన్నారు వైఎస్ షర్మిల. అప్పటికీ అనుమతి ఇవ్వక పోతే న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని చెప్పారు. పాదయాత్రను అడ్డుకొనేలా అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు తిప్పి కొడతామని ఆమె  తెలిపారు. ఈ అంశంపై వైఎస్ షర్మిల ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.


Also Read: India Vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌.. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్.. తుది జట్లు ఇవే..


Also Read: Draupadi Murmu : ఏపీ పర్యటనకు ద్రౌపది ముర్ము.. రెండు రోజుల షెడ్యూల్ ఇదే!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook