Warangal Tractor Accident: వరంగల్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. ఖానాపురం మండలం అశోక్ నగర్ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రాక్టర్ చెరువు కట్ట పైనుంచి వెళ్తున్న సమయంలో అదుపు తప్పి పక్కనే ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ట్రాక్టర్ వెనుక భాగం బోల్తా కొట్టగా... అందులో కూర్చొన్న 10 మందిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడిక్కడే చనిపోగా... మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తెలుస్తోంది. ట్రాక్టర్ నర్సంపేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 


మృతులను హర్షనాయక్ తండాలోని ధన్‌సింగ్ కుటుంబానికి చెందిన జాటోతు బిచ్చమ్మ (60), జాటోతు గోవిందు (65), గుగులోతు స్వామి (48), గుగులోతు సీత (45), గుగులోతు శాంతమ్మ (40)గా గుర్తించారు. ఈ నెల 24న ధన్‌సింగ్ కుమార్తె పెళ్లి ఉండటంతో.. అవసరమైన సామాగ్రి కొనుగోలు చేసేందుకు వీరంతా నర్సంపేటకు ట్రాక్టర్‌లో బయలుదేరినట్లు తెలుస్తోంది. ప్రమాద ఘటన గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించినట్లు సమాచారం. 


Also Read: Rajyasabha Kcr: జగన్ బాటలో కేసీఆర్.. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్!


Also Read:  Chandrababu Kadapa Tour: జగన్ ఇలాకాలో గర్జించిన చంద్రబాబు.. నియంతను తరిమికొడతామని వార్నింగ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook