Weather forecast: తెలంగాణలో చలి పులి- భారీగా పడిపోతున్న ఉష్టోగ్రతలు!
Weather forecast: తెలంగాణ రాష్ట్రం చలితో వణికిపోతోంది. గత రెండు మూడు రోజలుగా రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.
Weather forecast: తెలగాణాలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతూ పోతోంది. ఇటీవల ఉష్టోగ్రతలు భారీగా (Winter in Telangana) పడిపోయాయి. మరో నాలుగు రోజులు అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు హైదరాబాద్ (hyderabad weather) వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రాత్రి పూట చలి తీవ్రత 15 డిగ్రీలు అంతకన్నా (lowest temperature in Telangana) తక్కువకు పడిపోవచ్చని చెబుతోంది.
శనివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సగటు ఉష్టోగ్రత 12.5 డిగ్రీలకు పడిపోయింది. సాధారణంతో పోలిస్తే ఇది 2 డిగ్రీలు తక్కువ.
రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 7 నుంచే చలి తీవ్రత పెరుగుతోంది. సాధరణంతో పోలిస్తే 3 నుంచి 4 డిగ్రీల తక్కువగా ఉష్టోగ్రతలు నమోదవ్వచ్చని చెబుతోంది వాతావరణ విభాగం. ఈ సమయంలో గంటకు 8 కిలో మీటర్ల వేగంతో చలిగాలులు వీయొచ్చని అంచనా వేస్తోంది.
హైదరాబాద్‌లో ఉష్టోగ్రతల అంచనాలు..
హైదరాబాద్‌లో రానున్న రెండు మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్టోగ్రతలు 11 డిగ్రీల నుంచి గరిష్ఠంగా 13.9 డిగ్రీలుగా ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.
చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రాంతాల వారీగా కలర్ వార్నింగ్ జారీ చేసింది వాతావరణశాఖ. ఆదిలాబాద్, సిరిసిల్లా, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉండొచ్చని తెలిపింది. ఆయా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్టోగ్రతలు 6-7 డిగ్రీలకు పడిపోవచ్చని అంచనా వేసింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 10.6 డిగ్రీలుగా నమోదవ్వచ్చని వివరించిరంది.
మహబాబూబ్ నగర్, మెదక్, కరీనగర్, వరంగల్ జిల్లాలోలో సాధారణకన్నా తక్కువ ఉష్టోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతారవరణ విభాగం పేర్కొంది. ఇక నల్గొండ, ఖమ్మం జిల్లాలో సాధారణంతో పోలిస్తే స్వల్ప తగ్గుదల నమోదయ్యే అవకాశముందని తెలిపింది. చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Also read: Telangana omicron cases : తెలంగాణలో ఒక్క రోజులోనే 12 ఒమిక్రాన్ కేసులు, మొత్తం 20కి చేరిన కేసులు..
Also read: CJI NV Ramana: రామప్ప ఆలయంలో సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ పూజలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook