Weather Report: ఒకవైపు మాడు పగిలే ఎండలు... మరొవైపు ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ వాసులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. మిడిల్ మహారాష్ట్రలో కేంద్రీకృతమైన ఆవర్తనం కర్ణాటక మీదుగా దక్షిణి తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఇది ప్రయాణిస్తుందని తెలిపారు. దీంతో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో వాతావారణం సాధారణం ఉంచి 5 డిగ్రీలు తక్కువ నమోదు కానున్నాయి. మంగళవారం తెలంగాణలో గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. మహారాష్ట్రంలోని ఆవర్తనం కారణంగా తెలంగాణలో ఉష్టోగ్రతలు గణనీయంగా తగ్గాయి. మొన్నటి వరకు తెలంగాణలో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్టోగ్రతలు నమోదు అయ్యాయి. కానీ మంగళవారం తెలంగాణలో  40 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదు అయ్యాయి. మరో ఐదు రోజులు పాటు వాతావరణం ఇలాగే చల్లగా ఉంటుందని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిన్న హైదరాబాద్‌లో 34.9 డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రత మాత్రమే రికార్డు అయింది. బుధ, గురువారాల్లో కూడా అదే ఉష్ణోగ్రతలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కొనసాగనున్నాయి. ఆది వారం నుంచి మళ్లీ ఎండ వేడి పెరగనున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.


Also Read: Revanth Reddy Flight: రేవంత్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం ...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter