Asaduddin Owaisi: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అసదుద్దీన్ ఫోకస్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం పార్టీ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి ప్రతినిధులుగా ఉన్న నేతలను హైదరాబాద్‌కి పిలిపించుకున్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి వారితో భేటీ అయ్యారు.
హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం పార్టీ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి ప్రతినిధులుగా ఉన్న నేతలను హైదరాబాద్‌కి పిలిపించుకున్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసి వారితో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో ఓవైపు మమతా బెనర్జీ సర్కార్‌కి బీజేపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న నేపథ్యంలో తమ పార్టీని కూడా అక్కడి అసెంబ్లీ ఎన్నికల ( West Bengal assembly elections 2021 ) బరిలో నిలపాలని అసదుద్దీన్ ఒవైసి భావిస్తున్నట్టు సమాచారం. అయితే అంతకంటే ముందుగా అక్కడ పార్టీకి ఉన్న బలాబలాలు, ఏయే ప్రాంతాల్లో పార్టీకి ఎలా ఆధరణ ఉందనే కోణంలో అసదుద్దీన్ ఒవైసి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.
Also read : TRS MLA Muthireddy Yadagiri Reddy: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చేదు అనుభవం
ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించి అక్కడ తమ ఉనికిని చాటుకుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలపై అసదుద్దీన్ ఒవైసి ( Asaduddin Owaisi ) దృష్టిసారించడానికి అది కూడా ఓ కారణమై ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook