Janga Reddy Passed Away : బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి (Janga Reddy Passed Away) కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 1984 బీజేపీ (BJP) నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలో జంగారెడ్డి ఒకరు. హనుమకొండ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై 54 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో జంగారెడ్డి గెలుపొందారు. చందుపట్ల మృతికి బీజేపీ నాయకులు సంతాపం తెలిపారు. అయన మరణం పార్టీకి తీరని లోటని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జంగారెడ్డి.. 1935లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరకాలలో జన్మించారు. తెలంగాణ ఉద్యమంలోనూ తనవంతు పాత్ర పోషించారు. ఇవాళ ఉదయం 9.30 గంటలకు జంగారెడ్డి పార్థివదేహాన్ని కొండాపూర్​లోని ఆస్పత్రి నుంచి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించనున్నట్లు రాష్ట్ర నేతలు తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం రాష్ట్ర కార్యాలయంలో అర్ధగంట పాటు ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన స్వస్థలం పరకాలకు తరలించనున్నారు. 


Also Read: Medaram Jatara : మేడారం జాతర కోసం TSRTC ప్రత్యేక యాప్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook