Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?
Indiramma Housing Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు పట్టాలతో సహ ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి, సొంత జాగా ఉన్న అర్హులకు రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది.
Indiramma Housing Scheme: కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్లులేని పేదలకు పట్టాలతో సహ ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి, సొంత జాగా ఉన్న అర్హులకు రూ.5 లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలో మొదట సొంత జాగా ఉన్న పేదాలకు రూ.5 లక్షలు కేటాయించనుంది. అమరులకు 250 గజాల స్థలాన్ని కూడా కేటాయించనుందట.ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. అయితే, తొలిదశలో సొంత ఇల్లు ఉన్నవారికే రూ.5 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ సంవత్సరం దాదాపు 4.5 లక్షల ఇల్లు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
రూ.5 లక్షల సాయం దేనికి ఎంతిస్తారంటే?
తొలదశలో భాగంగా సొంతిల్లు ఉన్నవారికి రూ.5 లక్షలు మంజూరు చేయనుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పథకానికి రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు. ఇది కేవలం సొంతంగా జాగా ఉన్నవారికే వర్తిస్తుంది. పూరి గుడిసె ఉన్నా.. లేదా మట్టి గోడలతో ఇళ్లు నిర్మాణం చేపట్టినా ఈ పథకం వర్తిస్తుంది. ముందుగా ఇంటి పునాది నిర్మాణాలు చేపట్టిన సమయంలో లక్ష మంజూరు చేయనుంది. ఆ తర్వాత శ్లాబ్ నిర్మాణానికి మరో లక్ష, గోడల నిర్మాణం సమయంలో రెండు లక్షలు ఇవ్వనుంది. చివరగా నిర్మాణం తుదిదశంలో మిగిలిన లక్షరూపాయలు అందించనుంది.
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో నమోదు చేసుకున్న అర్హులందరికీ తొలి ప్రాధాన్యమివ్వాలని సీఎం చెప్పారు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం డబుల్ ఇండ్ల నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా అర్హులకు లబ్ధి జరిగేలా చూడాలని తెలిపారు. దశల వారీగా పేదల సొంతింటి కల నెరవేర్చడం ప్రభుత్వ సంకల్పమని వివరించారు. ఏయే దశల్లో ఈ నిధులను విడుదల చేయాలనే నిబంధనలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
అర్హులు..
1. దరఖాస్తుదారు తెలంగాణ శాశ్వత నివాసి అయి ఉండాలి.
2. వారికి సొంత ఇల్లు ఉండకూడదు. ఒక్కో ఇంటికి ఒక్కరినే అర్హులుగా ఎంపిక చేస్తారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter