Ashadamasam bonalu potharaju tradition: ఆషాడ మాసం మొదలైంది. చాలా మంది ఆషాడ మాసాన్ని శూన్య మాసం అనుకుంటారు. కానీ ఆషాడ మాసంలో అనేక పండుగలు అనేక ఉన్నాయి. వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు, బోనాల పండుగ, జగన్నాథుడి రథయాత్ర, తొలి ఏకాదశి, చాతుర్మాస్య యాత్ర, పౌర్ణమి ఇలా అనేక పండుగలు ఈ మాసంలో వస్తుంటాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బోనాల పండుగను ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీన్ని భక్తి, విశ్వాసాలతో చేసుకుంటారు. తెలంగాణ సర్కారు బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వంగా కూడా గుర్తించింది. దీంతో తెలంగాణ అంతటాకూడా బోనాలను ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..


ఊరు, వాడ అంతాట ప్రతి గుడి, అమ్మవారి ఆలయాలను ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. మరోవైపు హైదరాబాద్ లో బోనాల పండుగ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.ఇక్కడ గోల్గొండ, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, ఓల్డ్ సిటీ, బల్కంపేట, లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవార్ల ఆలయాలలో ఈ మాసంలో ఆదివారం, గురువారాల్లో వరుసగా బోనాలు నిర్వహిస్తారు. అయితే.. బోనాల నేపథ్యంలో పోతరాజులు ప్రత్యేక ఆకర్శణగా కన్పిస్తుంటారు. ఒళ్లంతా పసుపుపూసుకుని, చాలా బలిష్టంగా ఉండి, నోటిలో నిమ్మకాయలు, పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టుకుని ఉంటారు. వీరిని చూస్తేనే ఒక్కసారిగా భయంవేస్తుంది. రెండు చేతుల్లో, రెండు కొరడాలను పట్టుకుని, గాల్లో తిప్పుతింటారు. అదే విధంగా.. కొరడాతో భక్తులను ఆశీర్వదిస్తు కూడా ఉంటారు. 


అసలు పోతరాజు ఎవరు..?


బోనాల జాతర జరిగేటప్పుడు పోతరాజులు ఎందుకుంటారు. అసలు పోతరాజుల వెనుక ఈ పురాణ గాథ ప్రచురణలో ఉంది. పురాణాల ప్రకారం సప్త అమ్మవారి దేవతలు ఉండేవారు.పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి లాంటి పేర్లతో మొత్తం మనకు ఏడుగురు దేవతలు ఉన్నారు. ఆ సప్త మాతృలకు పోతరాజే సోదరుడు. పురాణాల ప్రకారం శివపార్వతులకు కుమారులు కలిగాక… ఒకనాడు వారు విహారానికి వెళ్తారంట. ఆ సమయంలో పార్వతీదేవి ఓ కొలను లోంచి ఏడు దోసిళ్ల నీళ్లు తాగగానే సద్యోగర్భంలో ఏడుగురు కన్యలు పుట్టారు. నీళ్లు తాగిన వెంటనే పిల్లలు పుట్టడం అర్ధం కానీ పార్వతీదేవి పరమేశ్వరుడి చెంతకు వెళ్లింది. ఆశ్చర్యంతో.. తన బాధను చెప్పుకుంది. 



ఇదేంటని ప్రశ్నించగా… వారి జన్మ రహస్యాన్ని పరమ శివుడు వివరించాడు. అమ్మవారు ఆ కూతుళ్లను వెంట తీసుకెళ్దామంటే… శివుడు వారించి వద్దని చెప్పాడంట. ఆ ఏడుగురిది స్వతంత్ర ప్రవృత్తి అని… మన మాట వినరని వివరిస్తాడు.అందుకే వారిని ఇక్కడే వదిలేసి వెళ్దామని శివుడు చెప్పగా, పార్వతి దేవీ నొచ్చుకుంటుందంట. దీంతో తన పిల్లల పరిస్థితులు ఏంటని అనుకోగా.. వారికి కాపాలాగా ఒక గణాన్ని సృష్టిస్తారు. అతడికి పోతరాజు అని పేరు కూడా పెడతారు. ఆయనకు అమ్మవారిని కాపాడే బాధ్యతను శివుడు అప్పగిస్తాడంట.



ఆ ఏడుగురిని పోతరాజే కాపాడాలని చెప్పి… పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోతరాజు… వారికి కాపాలా కాస్తూనే ఉన్నాడు. ఆ ఏడుగురే పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి. ఈ పేర్లనే పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ, చిత్తారమ్మ అంటూ… ఒక్కో చోటు ఒక్కోలా పిలుచుకుంటుంటారు.


Read more: Bonalu 2024: హైదారాబాద్ లో బోనాల సంబురం.. తొలి బొనం గోల్గొండలోనే ఎందుకు సమర్పిస్తారు.. ఈ స్టోరీ మీకు తెలుసా..?


ఈ విధంగా అమ్మవారిని పోతరాజులు కాపాడుతు ఉంటారం. అంతే కాకుండా.. ఆయన గ్రామంలో చెడుగాలులు, నెగెటివ్ ఎనర్జీని ఆయన పారద్రోలుతాడంట. అందుకే పోతరాజులు అమ్మవారికి కాపాలాగా ఉంటారంట. అంతేకాకుండా.. పోతరాజులు ఇంట్లోకి వస్తే, ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ, చెడు ప్రభావాలు దూరమైపోయతని భక్తులు విశ్వసిస్తుంటారు. అందుకు బోనాల పండుగలో అమ్మవారి ఊరేగింపులు ముందు, ఫలాహరాం బండ్ల ముందు పోతరాజులు కన్పిస్తుంటారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి