తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి 17 స్థానాలు కైవసం చేసుకుంటామని టీఆర్‌ఎస్ మొదటినుంచీ చెప్తూనే ఉంది. కేసీఆర్ చెప్పినట్లు అసలు వార్ వన్ సైడ్ లో జరిగిందా .. లోక్‌సభ ఎన్నికల ఓటింగ్ ఏకపక్షంగా సాగిందా లేదా అనేది ఇక్కడ చర్చనీయంశంగా మారింది. గురువారం నాటి పోలింగ్ సరళి బట్టి నేతలు ఎవరికి వారు తమ విజయం ధీమా వ్యక్తం చేస్తున్నారు
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓటింగ్ ఏకపక్షమంటున్న కేసీఆర్
ఓటింగ్ సరళిని గమనించిన కేసీఆర్ స్పందిస్తూ ప్రజల నాడి టీఆర్ఎస్ కు  సానుకూలంగా ఉందన్నారు. ముందుగా చెప్పినట్లుగానే ఈ ఎన్నికల్లో తాము పదహారు స్థానాలు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మిత్రపక్షం ఎంఐఎంతో కలిసి మొత్తం 17 స్థానాలు కైవసం చేసుకుంటామనే కాన్ఫిడెన్స్ ను కేసీఆర్ ప్రదర్శిస్తున్నారు. పార్టీ నేతలు, అభ్యర్థులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు .  ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో కష్టపడి పని చేశారంటూ పార్టీ శ్రేణులపై ప్రశంసల జల్లు కురిపించారు

 


పది స్థానాల్లో గెలుపుపై కాంగ్రెస్ ధీమా 
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత స్పష్టం కనిపించిందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం మీడియా సమావేశంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతిమాయ మాట్లాడుతూ ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా 10 ఎంపీ స్థానాలు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మరి కుంతియా మాటల్లో నిజం ఎంత అనేది తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.