KCR Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పర్యటన కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం హస్తిన వెళ్లిన కేసీఆర్.. శనివారం పలు సమావేశాలు నిర్వహించారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో సుదీర్ఘ చర్చలు జరిపారు. కేసీఆర్ నివాసానికి వచ్చిన అఖిలేష్ యాదవ్.. దాదాపు రెండున్నర గంటల పాటు అక్కడే ఉన్నారు. తర్వాత ఢిల్లీలో పర్యటించారు కేసీఆర్. కేజ్రీవాల్ సర్కార్ అభివృద్ధి చేసిన సర్వోదయ స్కూల్,  మొహల్లా క్లీనిక్ ను పరిశీలించారు. వాటి పనితీరును కేసీఆర్ కు వివరించారు ఢిల్లీ ముఖ్యమంత్రి. తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. దేశంలో త్వరలో సంచలనం జరగబోతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ తో రాజకీయాలపై చర్చించారా అన్న మీడియా ప్రశ్నకు సమాధానమిచ్చిన గులాబీ బాస్.. వ్యాపారవేత్తలు కలిస్తే బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు.. పొలిటికల్ లీడర్లు కలిస్తే రాజకీయ చర్చలే ఉంటాయన్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే అన్న కేసీఆర్.. దేశంలో ఏం జరగబోతుందో ముందుముందు చూద్దాం అంటూ కామెంట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో సంచలనం జరగబోతుందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో కేసీఆర్ ను ఇతర పార్టీల నేతలు లైట్ తీసుకుంటున్నారనే వాదన వస్తోంది. అందుకు అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్ వైఖరిని ఉదాహరణగా చూపుతున్నారు. కేసీఅర్ తో సుదీర్ఘంగా చర్చించిన అఖిలేష్ యాదవ్... బయటికి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేసినా ఆయన స్పందించలేదు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. కేసీఆర్ తో జరిపిన చర్చల వివరాలను అఖిలేష్ ఎందుకు మీడియాతో పంచుకోలేదనే వాదన వస్తోంది. కేసీఆర్ పై ఆయనకు నమ్మకం లేదని.. అందుకే మాట్లాడలేదని అంటున్నారు. ఇక కేజ్రీవాల్ కూడా కేసీఆర్ పక్కన ఉండగానే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై చర్చించారా అన్న ప్రశ్నకు.. తమకు రాజకీయాలు చేయడం  రాదు.. స్కూళ్ళు, హాస్పటల్స్ నిర్మించడమే తెలుసు అని కామెంట్ చేశారు. కాని జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ తో కలిసి పని చేస్తామని మాత్రం చెప్పలేదు.


జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. గతంలో ముంబై వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో చర్చించారు. అప్పుడు కూడా జాతీయ స్థాయిలో కేసీఆర్ కు మద్దతుగా ఉంటామన్న ప్రకటన మాత్రం ఆ ఇద్దరు నేతల నుంచి రాలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కేసీఆర్ విషయంలో ఆచితూచే స్పందించారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా అలానే వ్యవహరించారు. దీంతో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు అంతా సానుకూలంగా లేవని తెలుస్తోంది. ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్ ను పూర్తిగా నమ్మడం లేదని అంటున్నారు. ఇందుకు గతంలో కేసీఆర్ అనుసరించిన వైఖరి కూడా కారణమంటున్నారు. 2004లో కాంగ్రెస్ తో రాష్ట్రంలో అలయన్స్ పెట్టుకున్న కేసీఆర్.. ఎన్నికలు జరిగాకా ఫలితాలు రాకముందే ప్లేట్ ఫిరాయించారు. ఢిల్లీలో బీజేపీ నేతలతో చర్చలు జరిపారు.


ఇక కేంద్రంలోని మోడీ సర్కార్ విషయంలోనూ కేసీఆర్ స్టాండ్ పలుసార్లు మారుతూ వస్తోంది. మోడీ మొదటి టర్మ్ లో కేంద్రానికి మద్దతుగా నిలిచారు కేసీఆర్. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. గత ఏడాది ముందు వరకు కూడా రెండు పార్టీల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి . ఇటీవలి కాలంలోనే బీజేపీని టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్. కాని గతం అనుభవాల దృష్ట్యా టీఆర్ఎస్ అధినేతను ఇతర పార్టీల నేతలు అంత తొందరగా విశ్వసించలేకపోతున్నారని తెలుస్తోంది. అందుకే కేసీఆర్ తో చర్చలు జరుపుతున్న నేతలు.. కలిసి నడిచే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదని అంటున్నారు.


READ ALSO: YCP MLC Ananthbabu: వైసీపీ ఎమ్మెల్సీని కాపాడుతున్నారా? హత్య కేసు నమోదైనా పట్టుకోలేరా?


READ ALSO: Begum Bazar Murder: నీరజ్‌ను చంపింది వాళ్లే... ఆరుగురు నిందితుల అరెస్ట్.. కీలక వివరాలు వెల్లడించిన డీసీపీ...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి