YCP MLC Ananthbabu: వైసీపీ ఎమ్మెల్సీని కాపాడుతున్నారా? హత్య కేసు నమోదైనా పట్టుకోలేరా?

YCP MLC Ananthbabu: ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన వైసీపీ ఎమ్మెల్సే కారు మాజీ డ్రైవర్ మృతి కేసులో ఇంకా మిస్టరీ వీడటం లేదు.  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్  ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఘటన జరిగిన మూడు రోజులవుతున్నా ఎమ్మెల్సీని పోలీసులు గుర్తించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 22, 2022, 07:18 AM IST
  • ఇంకా దొరకని వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు
  • అనుమానాస్పద కేసును హత్యగా మార్చిన పోలీసులు
  • వైసీపీ ఎమ్మెల్సీ కోసం ప్రత్యేక బృందాల గాలింపు
 YCP MLC Ananthbabu: వైసీపీ ఎమ్మెల్సీని కాపాడుతున్నారా? హత్య కేసు నమోదైనా పట్టుకోలేరా?

YCP MLC Ananthbabu: ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన వైసీపీ ఎమ్మెల్సే కారు మాజీ డ్రైవర్ మృతి కేసులో ఇంకా మిస్టరీ వీడటం లేదు.  ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్  ఇంకా పోలీసులకు చిక్కలేదు. ఘటన జరిగిన మూడు రోజులవుతున్నా ఎమ్మెల్సీని పోలీసులు గుర్తించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్సీని కావాలనే పోలీసులు కాపాడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్సీని పట్టుకునే వరకు మృతదేహానికి పోస్ట్ మార్టం చేయనీమయమని మృతుని బంధువులు చెబుతున్నారు. దీంతో రెండు రోజులుగా కాకినాడ జీజీహెచ్ లోనే డ్రైవర్  సుబ్రమణ్యం డెడ్ బాడీ ఉంది.  

తమపై వస్తున్న ఆరోపణలపై కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు స్పందించారు. ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ పై కేసు నమోదు చేశామని చెప్పారు. ఆయనను అరెస్ట్ చేస్తామని ఎస్పీ ప్రకటించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాలతో కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటివరకు ఉన్న ఆధారాలతో ఈ కేసులో ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కరే ప్రధాన నిందితుడిగా ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్సీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నామని కాకినాడ ఎస్పీ తెలిపారు. సుబ్రమణ్యం మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఎమ్మెల్సీపై సెక్షన్ కింద 302 కింద కేసు నమోదు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశామని వెల్లడించారు. కేసు విచారణను నిష్పక్షపాతంగా జరపాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఎస్పీ రవీంధ్రనాథ్ బాబు తెలిపారు.

ఈనెల 20న అర్ధరాత్రి ఎమ్మెల్సీ కారులో డెడ్ బాడీ ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి కాకినాడ జిల్లా తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 20న రాత్రి ఏడున్నర గంటల సమయంలో తన స్నేహితుడు మణికంఠతో కలిసి సుబ్రమణ్యం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. అర్ధరాత్రి 12 తర్వాత ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్.. మృతుడి తల్లికి ఫోన్ చేసి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పాడు. తర్వాత సుబ్రమణ్యం సోదరుు నవీన్ కు ఎమ్మెల్సీ కాల్ చేసి.. హాస్పిటల్ రావాలని చెప్పాడు. హాస్పిటల్ లో డాక్టర్ చనిపోయాడని చెప్పడంతో.. డెడ్ బాడీని తన కారులో తీసుకుని ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్.. మృతుడి ఇంటికి వచ్చాడు.అయితే బాధితుడి బంధువులు ఆందోళన చేయడంతో తెల్లవారుజాము నాలుగు గంటల వరకు అక్కడే ఉన్నాడు ఎమ్మెల్సీ. తర్వాత తన కారును అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి మృతుడి బంధువులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.

READ ALSO: Todays Gold Rate: పసిడి ప్రియులకు షాక్, పెరిగిన బంగారం ధర, మే 22 ఇవాళ్టి బంగారం ధర

READ ALSO: Dead Body in MLC Car: సంతకం పెట్టాలని కొడుతున్నారు.. పోలీసులపై మృతుడి భార్య సంచలన ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News