Wife harassed husband in kamareddy district banswada: కొందరు శాడిస్టులుగా ప్రవర్తిస్తుంటారు.  పెళ్లి తర్వాత కట్టుకున్న వాళ్లను వేధిస్తుంటారు. ఇలాంటి ఘటనల్లో మహిళలు, పురుషులు కూడా ఉంటున్నారు. కొందరు తమ భార్యలు కట్నం తేలేదని, అందంగా లేరని వేధిస్తుంటారు. మరికొందరు కూర వండటానికి రాలేదని, చికెన్ కూరలో ఉప్పు తక్కువ పడిందని కూడా గొడవలు పడుతుంటారు. ఎవరితో మాట్లాడిన కూడా అనుమానంతోనే ఉంటారు. కనీసం ఇంట్లో వాళ్లతో కూడా సరిగ్గా ఉండనీయరు. ఇంట్లో చుట్టాలు రావోద్దు, ఫోన్ లలో ఎక్కువగా సేపు మాట్లాడవద్దని షరతులు పెడుతుంటారు. ఇక భార్యలు కూడా తామేం తక్కువ తిన్నామా.. అన్న విధంగా ఉంటారు. తమ భర్తలను రాచిరంపాన పెడుతుంటారు. బంగారం కొనియ్యలేదని, కారులో తిప్పలేదని వేధిస్తుంటారు. మరికొందరైతే.. ఇష్టంలేని పెళ్లిని చేసుకుంటారు. మొగుడ్ని ఎలాగైన విడిపించుకోవాలని, భార్యను నానా యాతన పెడుతుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇంట్లో సరిగ్గా ఉండరు. ఇతరులతో ఇంట్లోనే ఎఫైర్ లు పెట్టుకుంటారు. అత్తమామలకు నరకం చూపిస్తుంటారు. భార్తను కూడా కొడుతూ రివర్స్ లో కేసు పెడుతానంటూ కూడా వేధిస్తుంటారు. ఇక ఈమధ్య కాలంలో మహిళా బాధితులు సమాజంలో ఎక్కువయిపోయారు. ప్రతిరోజు మహిళల వేధింపుల బారిన పడుతున్న మగాళ్ల ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. ఈ కోవకు చెందని ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.  బాన్సువాడకు చెందిన ఒక వ్యక్తి  పోలీసు స్టేషన్ కు వచ్చాడు. తన భార్య ప్రతిరోజు ఇంట్లో నరకం చూపిస్తుందని, ఎలాగైన తన భార్య బారినుంచి కాపాడాలంటూ కూడా వేడుకున్నాడు. అంతేకాకుండా అతగాడు.. అర్ధనగ్నంగా స్టేషన్ కు వచ్చి తన బాధను అక్కడున్న పోలీసులతో చెప్పుకున్నాడు. పోలీసులు ఈ ఘటన చూసి ఖంగుతున్నారు. ఈ క్రమంలో అతనికి పీఎస్ లకు కౌన్సిలింగ్ ఇప్పించారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.


Read more: Akshay Kumar: 56 ఏళ్ల వయసులో తొలిసారి ఓటు వేసిన హీరో అక్షయ్ కుమార్.. కారణం ఏంటో తెలుసా..?


దీన్ని చూసిన నెటిజన్లు.. పాపాం.. భర్త మీద ఇదేం శాడిజం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం.. మగళ్లకు సమాజంలో సెఫ్టీలేకుండా పోయిందంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు మహిళల మాదిరిగానే, పురుషులకు కూడా ప్రత్యేకంగా చట్టాలు తీసుకొని రావాలంటూ కూడా తిట్టిపోస్తున్నారు. పోలీసులు కూడా అతగాడి బాధను విని ఖంగుతిన్నారు. సాటి మగాడికి తమ వంతుగా ధైర్యం చెప్పి అక్కడి నుంచి బాధితుడికి పంపించి వేశారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter