Akshay Kumar: 56 ఏళ్ల వయసులో తొలిసారి ఓటు వేసిన హీరో అక్షయ్ కుమార్.. కారణం ఏంటో తెలుసా..?

Loksabha elections 2024: బాలీవుడ్ నటుడు హీరో అక్షయ్ కుమార్ తొలిసారి తన ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. బాంబేలో ఆయన ఓటు వేసి, ప్రజలు కూడా ముందుకు రావాలంటూ సూచించారు.

1 /6

దేశంలో ప్రస్తుతం ఐదో విడుతలో పోలింగ్ జరుగుతుంది. ఆరు రాష్ట్రాలతో పాటు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓటింగ్ జరుగుతుంది. 

2 /6

ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహర్, జార్ఖండ్ , జమ్ముకశ్మీర్ లలో ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. అనేక మంది రాజకీయ, సినిమా రంగ ప్రముఖులు వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు.

3 /6

బాలీవుడ్ సూపర్ స్టార్ లంతా ఉదయం నుంచి పెద్ద ఎత్తున వచ్చి తమ ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో ఈసారి బాలీవుడ్ హీరో  అక్షయ్ కుమార్ తొలిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలుస్తొంది. 

4 /6

56 ఏళ్ల వయసున్న హీరో అక్షయ్ కుమార్ ఇండియాలో ఓటు వేయడం ఇదే తొలిసారిగా సమాచారం.  గతంలో ఆయన కెనడా పౌరసత్వం కలిగి ఉన్నారు.  ఇటీవల ఆయన తిరిగి భారత్ పౌరసత్వం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం జరుగుతున్న ఐదో విడత ఎన్నికలలో తన ఓటును వేశారు.

5 /6

హీరో అక్షయ్ కుమార్ బాంబేలో తన ఓటు హక్కును వినియోంచుకున్నారు. అదే విధంగా ప్రజలంతా బైటకు వచ్చి రాజ్యంగం మనకు ఇచ్చిన ఓటు అనే ఆయుధంను వాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి రాజకీయ ప్రముఖులు, బాలీవుడ్ ప్రముఖలు ఓటేయడానికి క్యూలు కట్టారు.

6 /6

ఇక ఓటు వేసిన ప్రముఖులలో.. శ్రీదేవీ కూతురు జాన్వీకపూర్, నగ్మా, హృతిక్ రోషన్ కుటుంబం, పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ, దీపిక, రన్ వీర్, సంజయ్ దత్ లు తదితరులు ఉన్నారు.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x