Wines Bandh: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆరోజు మొత్తం వైన్స్ బంద్
Wines Bandh in Hyderabad: హైదరాబాద్ సహా జంట నగరాల్లో ఉన్న మందుబాబులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది, అసలు ఏమైంది అంటే?
Wines Bandh in Hyderabad: హైదరాబాద్ సహా జంట నగరాల్లో ఉన్న మందుబాబులకు ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ లో మద్యం షాపులు బార్లు, పబ్బులు మూసివేత గురించి పోలీసు ఉన్నతాధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 30వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లు, రిజిస్టర్ క్లబ్బులు, పబ్బులు మూసి ఉంచుతారని తెలుస్తోంది.
అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ లో కూడా బార్ రూమ్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్ర నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతల ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున పోలీసులు నిర్వహిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా మద్యం అందుబాటులో ఉంటే శాంతిభద్రతలకు ఇబ్బంది అవుతుందనే కారణంతో పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.
హైదరాబాదులో కేవలం శ్రీరామనవమి మాత్రమే కాదు బోనాల సందర్భంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా, హోలీ సందర్భంగా కూడా మద్యం షాపుల మీద ఆంక్షలు విధిస్తూ ఉంటారు. మద్యం విరివిగా అందుబాటులో ఉంటే అది తాగిన తర్వాత శోభాయాత్రలు, ఊరేగింపులలో మద్యం తాగి యువత కొట్లాటలకు దిగే అవకాశం ఉందని పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక 30వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఆరోజు ఉదయం 6 గంటల నుంచి తర్వాత రోజు ఉదయం 6 గంటల వరకు అంటే సుమారు 24 గంటల పాటు మద్యం షాపులు మాత్రమే కాదు వైన్స్, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఫైవ్ స్టార్ హోటల్, సెవెన్ స్టార్ హోటల్స్ లో ఉన్న బార్ రూములు సైతం మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించి మద్యం అమ్మితే లైసెన్సులు రద్దు చేయడానికి కూడా వెనుకాడబోమని ఎక్సైజ్ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి మందుబాబులు ఆ ఒక్కరోజు మద్యానికి దూరంగా ఉండక తప్పదని నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Mahesh Babu movie Fees: మహేష్ ఒక్క సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Also Read: Ravanasura Trailer: ఆసక్తి రేకెత్తిస్తున్న రావణాసుర ట్రైలర్.. రవితేజ మార్క్ మాస్ ఇది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook