Mahesh Babu Charge For one Film: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. తెలుగులో ఆయన చేస్తున్న సినిమాలన్నీ సూపర్ హిట్ లుగా నిలుస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు మహేష్ బాబు కూడా ఫ్లాపులతో సతమతమయ్యారు. కానీ ఇప్పుడు మాత్రం అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడంతో పెద్దగా సినిమాలు ఫ్లాప్ అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఇప్పటికీ మహేష్ బాబు అంటే లేడీస్ కి చాలా అభిమానం. అమ్మాయిలంతా తమ డ్రీం బాయ్ గా మహేష్ బాబు లాంటి వ్యక్తి రావాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి మహేష్ బాబు ఒక్కొక్క సినిమాకి ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా. ఒక్కొక్క సినిమాకి మహేష్ బాబు 70 నుంచి 80 కోట్ల వరకు చార్జి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొన్ని సినిమాల విషయంలో మహేష్ బాబు సగం రెమ్యునరేషన్ తీసుకొని మిగతా సిమ్ సగం రెమ్యూనరేషన్ తన వాటాగా సినిమాలోని పెట్టుబడి పెడతారు.
అలాంటి సినిమాలకు జిఎంబి ఎంటర్టైన్మెంట్ సహానిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటుంది. మరికొన్ని సినిమాలకు మాత్రం మహేష్ బాబు పూర్తిస్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని నిర్మాత బాధ్యతలు మాత్రం తీసుకోరు. అలాంటి సినిమాలకు దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకు మహేష్ బాబు వసూలు చేస్తున్నట్లుగా సమాచారం. ఇక మహేష్ బాబు కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ ఆయా బ్రాండ్లకు సంబంధించిన ప్రోడక్ట్లను ప్రమోట్ చేస్తూ కొన్ని యాడ్స్ కూడా చేస్తూ ఉంటారు.
అలా యాడ్ చేసి బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరించినందుకు గాను దాదాపు 10 కోట్ల వరకు వసూలు చేస్తున్నారట. మొత్తం మీద మహేష్ బాబు రెమ్యూనరేషన్ చూసిన చాలామంది షాక్ అవుతూ ఉంటారు ఎందుకంటే మిగతా హీరోల లాగా ఆయన పాన్ ఇండియా హీరోగా ఇంకా పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ అవ్వలేదు కానీ మహేష్ డిమాండ్ చూసినవారు ఎవరు కూడా ఆయనకు తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధమవ్వరు. ఈ విషయంలో ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.
Also Read: MM Keeravani Bed rest: ఆస్కార్ అందుకుని ఇండియా వచ్చిన కీరవాణికి బెడ్ రెస్ట్.. ఏమైందంటే?
Also Read: Dasara Movie First Review: రచ్చ రేపిన నాని.. పుష్ప 2.0గా దసరా.. రేటింగ్ ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook