WINGS INDIA: హైదరాబాద్‌లో విమానాల పండుగ.. షో చూస్తే `వావ్` అంటారు
Wings India Show: గగనతలంలో విహరించే విమానాలు భూతలంపై వచ్చి వాలిపోయాయి. చిన్న, పెద్ద, భారీ తరహా విమానాలు తెలంగాణ నడిబొడ్డుపై సందడి చేస్తున్నాయి. మరోసారి హైదరాబాద్‌లో విమానాల పండుగ షురూవైంది. జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాలను ప్రదర్శనకు ఉంచాయి. ప్రదర్శన వివరాలు ఏంటి? ఎప్పుడు సందర్శించవచ్చు అనే విషయాలు తెలుసుకోండి.
Air Show 2024: హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాల ప్రదర్శన 'వింగ్స్ ఇండియా' గురువారం ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ సహకారంతో ఫిక్కీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విమానాల ప్రదర్శనను మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. '2047 నాటికి విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. ముంబై, ఢిల్లీలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇలాంటివి మరిన్ని నిర్మించాల్సి ఉంది. ఉడాన్ పథకం కింద జమ్మూకశ్మీర్‌లో హెలికాప్టర్ ప్రయాణాలు ప్రారంభించాం. డ్రోన్‌ల అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నాం. నేడు ఉడాన్ 5.3ను ప్రారంభించడం పౌర విమానయాన చరిత్రలో ఇది నిలిచిపోయే రోజు' అని పేర్కొన్నారు.
'గతేడాది 15.2 కోట్ల మంది ప్రయాణికులు విమానాల్లో ప్రయాణించారు. 2030 కల్లా 30 కోట్ల మందిని విమానయాన రంగానికి చేరువ చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం పౌర విమానయాన రంగానికి ఎంతో తోడ్పాటు అందిస్తోంది. పది వేల మంది మహిళలకు డ్రోన్స్‌పై శిక్షణ ఇస్తాం.. ఇక డ్రోన్లకు 80 శాతం రాయితీ ఇస్తాం. ప్రపంచంలో అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్‌లను భారత్ కొనుగోలు చేస్తుంది' అని కేంద్ర మంత్రి సింధియా తెలిపారు.
అన్ని సేవల్లో డ్రోన్లుః కోమటిరెడ్డి
తెలంగాణలో విమానయాన రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలమని చెప్పారు. డ్రోన్ పైలెట్లకు శిక్షణ ఇచ్చి.. వ్యవసాయం.. అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల్లో డ్రోన్ల వినియోగంతో సేవలు అందిస్తాం అని మంత్రి తెలిపారు.
ప్రదర్శన ఇలా..
106 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధుల హాజరు
130 ఎగ్జిబిటర్స్, 15 చాలెట్స్
ప్రదర్శనకు వచ్చిన విమానాలు: 15
సందర్శన ఎప్పుడు
ప్రదర్శన తేదీలుః 18 నుంచి 21వ తేదీ వరకు
18 నుంచి 21 వరకు భారత వాయుసేన విన్యాసాలు
ప్రజల సందర్శన
20, 21 తేదీల్లో రెండు రోజుల పాటు సాధారణ ప్రజలకు అనుమతి
టికెట్ ధర: రూ.750 (మూడేళ్లలోపు పిల్లలకు ఉచితం)
బుకింగ్ ఎలా: బుక్‌మైషో యాప్
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter