చిరంజీవి ఇంటిముందు మహిళ హల్చల్
జూబ్లీహిల్స్ లోని సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటిముందు ఓ మహిళ అర్ధరాత్రివేళ హల్ చల్ చేసింది. తనకు చిరంజీవి తెలుసని.. ఒకసారి నాపేరు చెబితే ఆయన ఇంటినుండి బయటకు వస్తాడని గేటుముందున్న సిబ్బందితో గొడవకు దిగే ప్రయత్నం చేసింది.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటిముందు ఓ మహిళ అర్ధరాత్రివేళ హల్ చల్ చేసింది. తనకు చిరంజీవి తెలుసని.. ఒకసారి నాపేరు చెబితే ఆయన ఇంటినుండి బయటకు వస్తాడని గేటుముందున్న సిబ్బందితో గొడవకు దిగే ప్రయత్నం చేసింది.
పోలీసుల కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్రీదేవి (40) శుక్రవారం అర్థరాత్రి దాటాక చిరంజీవిని కలవడానికి చేరుకుంది. ఇంటిముందు ఆమె చాలాసేపు కూర్చోనేసరికి సెక్యూరిటీ ప్రశ్నించగా.. 'చిరంజీవి తెలుసని.. చిరంజీవికి శ్రీదేవి వచ్చిందని చెప్తే ఆయనే బయటకు వస్తారని చెప్పింది. ఖంగుతిన్న సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకొనే ప్రయత్నం చేసినా.. 'శ్రీదేవి వచ్చిందటే.. చిరంజీవి గుర్తుపడతారంది. పాడిందే పాట అన్నచందంగా ఎన్నిసార్లు అడిగినా అదే జవాబు చెప్పడంతో సిబ్బంది సమీప పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సాయంత్రం శ్రీదేవి బంధువులకు కబురుపంపి ఆమెను పంపించేశారు.