హైదరాబాద్‌ : హైదరాబాద్‌ వరదలు ( Hyderabad Floods ) నగరవాసుల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ఎటు చూసినా నడుం లోతు నీళ్లు.. కూలిన ఇళ్లు.. రోడ్డున పడిన బతుకులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో వరదలు కొత్త కాకపోయినా.. ఈసారి వచ్చిన భారీ వరదలు మాత్రం ఎప్పుడూ లేనన్ని ఇబ్బందులను కొనితెచ్చాయి. అనేకచోట్ల ఇళ్లు సగం మునిగిపోయి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురిసన భారీ వర్షానికి ( Heavy rains ) చాలా చోట్ల ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలు వరద నీళ్లలో కొట్టుకుపోయాయి. ఇంకొన్ని చోట్ల భారీ వాహనాలు సైతం వరద నీటిలో మునిగిపోయాయి. దీనికితోడు రోడ్డు మార్గాలు తెగిపోవడంతో ఆయా ప్రాంతాలతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. తినడానికి తిండి లేక, తాగడానికి తాగు నీరు లేక వరద ప్రభావిత ప్రాంతాల్లోని నగరవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. Also read : Telangana Floods: తక్షణ సాయంగా 1,350 కోట్లు అందించండి.. ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నగరంలో భారీ వరదలు ( Floods ) పోటెత్తిన నేపథ్యంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి తమ పరిధిలోని ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే వరద సహాయక చర్యలను పర్యవేక్షించి పరిస్థితిని సమీక్షించటానికి బోటులో అధికారులతో కలిసి తమ కాలనీకి వచ్చిన టీఆర్‌ఎస్‌ నేత, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డిని ( TRS MLA Bethi Subhash Reddy ) అక్కడి మహిళలు గట్టిగా నిలదీశారు. మూడు రోజుల నుంచి వరదల్లో తమ ఇళ్లు మునిగిపోయాయని, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక పిల్లలతో కలిసి తిప్పలు పడుతున్నా.. తమను పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ మహిళలు ఎమ్మెల్యేతో వాగ్వీవాదానికి దిగారు. తమను సురక్షిత ప్రాంతానికి ఎందుకు తరలించటం లేదని ఎమ్మెల్యేపై మహిళలు మండిపడ్డారు. Also read :  Sabarimala temple: అయ్యప్ప భక్తులకు ముఖ్య గమనిక


మహిళలు అగ్రహం వ్యక్తంచేస్తుండటంతో వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇలాంటి చోట ఇళ్లు ఎవరు నిర్మించుకొమ్మని చెప్పారంటూ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రశ్నించారు. అనుకోకుండా వరదలు వస్తే ఇందులో తాము చేయడానికి ఏముంటుందని సదరు మహిళలను ఎమ్మెల్యే ఎదురు ప్రశ్నించారు. అప్పటికే ఆవేదనతో రగిలిపోతున్న మహిళలకు ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలు విన్నాకా వారి ఆగ్రహం మరింత ఎక్కువైంది. దీంతో ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది మీరే కదా ?.. మరి పర్మిషన్ ఎందుకు ఇచ్చారంటూ మహిళలు మరోసారి ఎమ్మెల్యేపై మండిపడ్డారు. ఒకవేళ తాము ఈ వరదల్లోనే చిక్కుకుని చావాల్సి వస్తే.. 'నీ పేరే రాసి చస్తాం' అంటూ ఎమ్మెల్యేను హెచ్చరించింది ఓ మహిళ. 


మహిళల ఆగ్రహాన్ని కళ్లారా చూసిన ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి.. వారికి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయారు. ఉప్పల్ ఎమ్మెల్యేపై మహిళలు ఆగ్రహం వ్యక్తంచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా ( MLA Bethi Subhash Reddy viral video ) మారింది. సుభాష్ రెడ్డి వైఖరి చూసిన నగరవాసులు.. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారా అంటూ మండిపడుతున్నారు. బేతి సుభాష్ రెడ్డి వైఖరిపై నెటిజెన్స్ నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. Also read : Traffic Cop dragged on car: ట్రాఫిక్ పోలీసును కారుపై లాక్కెళ్లిన డ్రైవర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe