Traffic Cop dragged on car: ట్రాఫిక్ పోలీసును కారుపై లాక్కెళ్లిన డ్రైవర్

Traffic violations in Delhi: న్యూ ఢిల్లీ: ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని నడపడమే కాకుండా తన వాహనాన్ని ఆపబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ( Traffic constable ) కారు బ్యానెట్‌పైనే దాదాపు 400 మీటర్ల దూరం లాక్కెళ్లాడు ( Cop dragged on car bonnet) ఓ కారు డ్రైవర్. ఢిల్లీలోని దోళాఖావ్‌లో ( Dhaula Kuan in Delhi ) అక్టోబర్ 12న సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ( CCTV cameras ) రికార్డయింది.

Last Updated : Oct 15, 2020, 05:31 PM IST
Traffic Cop dragged on car: ట్రాఫిక్ పోలీసును కారుపై లాక్కెళ్లిన డ్రైవర్

Traffic violations in Delhi: న్యూ ఢిల్లీ: ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని నడపడమే కాకుండా తన వాహనాన్ని ఆపబోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ( Traffic constable ) కారు బ్యానెట్‌పైనే దాదాపు 400 మీటర్ల దూరం లాక్కెళ్లాడు ( Cop dragged on car bonnet) ఓ కారు డ్రైవర్. ఢిల్లీలోని దోళాఖావ్‌లో ( Dhaula Kuan in Delhi ) అక్టోబర్ 12న సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ( CCTV cameras ) రికార్డయింది. కారు డ్రైవర్ ప్రవర్తనతో షాక్ అయిన ట్రాఫిక్ పోలీసు.. కారు బ్యానెట్‌ని బలంగా పట్టుకుని కారుపైనే వేళ్లాడాడు. ఐతే ట్రాఫిక్ పోలీసు ఎంతకీ తనని విడిచిపెట్టకపోవడంతో అతడిని అడ్డు తొలగించుకునేందుకు కారు డ్రైవర్ కారుని అటుఇటు పోనిస్తూ ట్రాఫిక్ పోలీసును నడిరోడ్డుపై పడేసి వెళ్లాడు.

ఎలాగోలా కొంతదూరం మేనేజ్ చేసుకోగలిగినప్పటికీ... ఆ తర్వాత  పట్టు కోల్పోయి కారుపై నుంచి కారుకు ఎడమ పక్కకు కిందపడిపోయిన ట్రాఫిక్ పోలీసు వెంటనే లేచి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అదృష్టవశాత్తుగా ఆ వెనకాలే వస్తున్న వాహనాలు వేగంగా లేకపోవడంతో అతడికి ప్రాణపాయం తప్పింది. Also read : Watch Baba Ramdev falls off elephant: ఏనుగుపై యోగా చేస్తూ కింద పడిన బాబా రాందేవ్‌

ట్రాఫిక్ కానిస్టేబుల్‌ని కారుపై లాక్కెళ్లడం గమనించిన ఇతర వాహనదారులు, ట్రాఫిక్ పోలీసులు ఆ కారుని వెంబడించి నిందితుడిని పట్టుకున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ మహిపాల్ సింగ్‌ని కారు బ్యానెట్‌పై లాక్కెళ్లినందుకు కారు డ్రైవర్ శుభమ్‌పై ఢిల్లీలోని కంటోన్మెంట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. Also read : Hathras Case: బాధితురాలి కుటుంబసభ్యులకు మూడంచెల భద్రత: యూపీ ప్రభుత్వం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News