హైదరాబాద్ చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గురువారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేత వారణాసి భగవత్(32) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గత కొంతకాలంగా తన భర్త ప్రవీణ్ కుమార్‌తో కలిసి అపర్ణ సైబర్ జోన్‌లోని ఓ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నారు. భార్యభర్తలు ఇద్దరూ గచ్చిబౌలిలోని ఐటీ జోన్‌లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటున్నారు. వీళ్లిద్దరికీ 2011లో వివాహం జరిగింది. అయితే వివాహమై ఏడేళ్లు గడిచినా సంతానం కలగడం లేదనే మనోవేదనకు గురైన ఆమె తాను ఉంటున్న ఫ్లాట్‌లోనే సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 


మహిళా టెక్కీ ఆత్మహత్య ఘటనపై సమాచారం అందుకున్న చందానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై నాగయ్య తెలిపారు.