Sandhya Theatre: సంధ్య థియేటర్‌లో మహిళా ఫ్యాన్ మృతి.. అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి
Allu Arjun Fan Died In Sandhya Theatre: సంధ్య థియేటర్‌లో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట చోటుచేసుకుని ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Sandhya Theatre: ఒక్కసారిగా ప్రేక్షకులు విరుచుకుపడడంతో ఊపిరాడక ఓ మహిళ మృతి చెందింది. పలువురికి గాయాలవడంతో సంధ్య థియేటర్‌లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటనతో అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడని సమాచారం. సందడిగా ఉండాల్సిన థియేటర్ ఈ ఘటనతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల థియేటర్‌లలో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.
Also Read: Pushpa 2 The Rule: ఇంటర్నెట్‌లో పుష్ప 2 సినిమా లీక్..? 'వైల్డ్ ఫైర్'గా అల్లు అర్జున్ ఎంట్రీ
ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 ది రూల్ విడుదలైన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన పుష్ప 2 ప్రీమియర్ షో బుధవారం రాత్రి 9.30కు ప్రదర్శితమైంది. సంధ్య థియేటర్‌లో అల్లు అర్జున్ వచ్చారని సమాచారం. అయితే సినిమాకు అడ్డాగా ఉన్న ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు ఐకాన్ స్టార్ రావడంతో అభిమానులు ఎగబడ్డారు. వేల సంఖ్యలో అభిమానులు, ప్రేక్షకులు తరలిరావడంతో థియేటర్ కిక్కిరిసిపోయింది. థియేటర్ లోపలికి ఎగబడడంతో పరిస్థితి చేయి దాటింది. తీవ్ర తొక్కిసలాట ఏర్పడింది. ఈక్రమంలో కొందరు అస్వస్థతకు గురయ్యారు.
Also Read: Pushpa 2 The Rule: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పై విరిగిన లాఠీ.. సంధ్య థియేటర్ వద్ద ఉద్రిక్తత
అభిమానుల తొక్కిసలాటలో ఓ మహిళా మృతి చెందినట్లు సమాచారం. ఇద్దరు బాలురు గాయపడ్డారని తెలుస్తోంది. వారిలో ఒక బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా గాయపడిన వారిని సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ సంఘటనతో అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడని తెలుస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారని అల్లు అర్జున ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఇలాంటి సంఘటనలే తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల వద్ద చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. అర్ధరాత్రి కావడంతో ఎక్కడ ఏమి జరిగిందనే వార్తలు బయటకు రాలేదు. గురువారం ఉదయం ఆయా సంఘటనలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సంఘటనలతో సినిమాకు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్న చిత్రబృందం ఈ ఘటనతో మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
సినిమా హిట్‌తో పండుగే
కాగా సినిమా మాత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. పుష్ప మొదటి దానికన్నా సీక్వెల్ మించి ఉందని చర్చ జరుగుతోంది. సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ ఎంట్రీ సీన్లు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ సినిమా బన్నీ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.