Yadadri Temple Inauguration: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయ పున:ప్రారంభోత్సవంలో భాగంగా ఇవాళ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి యాదాద్రి ఆలయ ఆగమశాస్త్ర సలహాదారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామిని ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మహాకుంభ సంప్రోక్షణకు ముహూర్తం పెట్టిన చిన్న జీయర్‌నే కార్యక్రమానికి ఆహ్వానించకపోవడంతో... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయనకు మధ్య దూరం అలాగే కొనసాగుతోందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలోనే జరుగుతుందని అంతా భావించారు. కానీ చిన్న జీయర్ స్వామి సహా ఎవరికీ ప్రత్యేక ఆహ్వానం పంపలేదని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి వెల్లడించారు. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని... శిలాఫలకం ఏర్పాటు లేదని తెలిపారు. మరోవైపు, ప్రభుత్వం నుంచి ఇక తనకు ఆహ్వానం అందదని తెలిసి కొద్దిరోజుల క్రితమే చిన్న జీయర్ స్వామి ముచ్చింతల్ నుంచి విజయవాడలో కృష్ణా నది ఒడ్డున ఉన్న సీతానగరం ఆశ్రమానికి వెళ్లినట్లు తెలుస్తోంది.


ఒక రకంగా చిన్న జీయర్‌ స్వామికి ఇది సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ అన్న వాదన వినిపిస్తోంది. ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా శిలాఫలకంపై తన పేరు లేకపోవడంతో సీఎం కేసీఆర్ ఆగ్రహించినట్లు అప్పట్లో  ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దాంతో కేసీఆర్ సహస్రాబ్ది వేడుకల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. టీఆర్ఎస్ మంత్రులు, శ్రేణులు కూడా అటు వైపు వెళ్లలేదు. చిన్న జీయర్ స్వామి అంటే ఎంతో అభిమానించే, ఆరాధించే కేసీఆర్.. సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకాకపోవడంతో ఈ ఇద్దరి మధ్య చెడిందనే ప్రచారం తెర పైకి వచ్చింది.


మీడియా సమావేశాల్లో ఇటు సీఎం కేసీఆర్, అటు చిన్న జీయర్ తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని వెల్లడించినప్పటికీ.. జరుగుతున్న పరిణామాలు మాత్రం అందుకు విరుద్ధంగానే ఉన్నాయి. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ చిన్న జీయర్ పట్ల ఇంకా ఆగ్రహంగానే ఉన్నారని.. అందుకే మహాకుంభ సంప్రోక్షణకు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పంపలేదనే వాదన వినిపిస్తోంది. 


Also Read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై స్పందించని పవన్ కళ్యాణ్.. సినిమా ఇంకా చూడలేదా?


Also Read: Oscar Awards 2022: లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానం, ఆస్కార్ అవార్డు విజేతల జాబితా ఇదే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook