Yadagirigutta: పవిత్ర యాదగిరిగుట్టలో అపచారం.. మాంసాహారంతో విందు భోజనం..
Yadadri temple: పవిత్రమైన యాదాద్రి ఆలయందేవస్థానం పరిధిలో మాంసాహరం విందుభోజనం చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన వైటీడీఏ దివ్య విడిది(ప్రెసిడెన్సియల్ విల్లా)లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
Nonveg party in ytda villa at yadadrigutta: యాదాద్రి గుట్టను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ కొలువైన లక్ష్మీనరసింహస్వామి వారు భక్తులకు కొంగుబంగారంలా వరాలిస్తారని విశ్వసిస్తారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ యాదాద్రి డెవలప్ మెంట్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. యాదాద్రి ఆలయం, చుట్టుపక్కల ప్రదేశాల రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. కొత్తగా నిర్మితమైన ఆలయంను చూడటానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా.. చుట్టుపక్కల నుంచికూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇక్కడ ప్రతి శనివారం, ఆదివారం భారీగా రద్దీ నెలకొని ఉంటుంది. ఇటీవల డెవలప్ చేసి ఆలయానికి అనుబంధంగా కొన్ని కాటేజీలను కూడా ప్రత్యేకంగా భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఇవన్ని ఆలయం పరిసర ప్రాంతాలలో ఉంటాయి. ఇక్కడ భక్తులు ఉండటానికి ప్రత్యేకమైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.
అయితే.. అంతటి పవిత్ర యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థాన పరిధిలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వైటీడీఏ దివ్య విడిది (ప్రెసిడెన్సియల్ విల్లా)లో మాంసాహార విందు ఘటన వెలుగులోకి వచ్చింది. గురువారం దివ్య విడిది కాటేజీలోని ఆడిటోరియంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యమ నేత దాచూరి రామిరెడ్డి 8వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాలకు చెందిన ప్రతినిధులతోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నారు.ఈ సభలో మధ్యాహ్నం జెన్‌కో విల్లాలో దేవస్థాన నిబంధనలకు విరుద్ధంగా చికెన్‌తో కూడిన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో చికెన్ పెట్టడమేంటని కొందరు ఉపాధ్యాయులు షాక్ కు గురయ్యారు.
దీనిపై కొందరు ఉపాధ్యాయులు కూడా అపచారంభావనతో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై కొందరు.. వైటీడీఏ అధికారులతో మాట్లాడితే దివ్య విడిది పేరుతో ఆడిటోరియాన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో.. చికెన్ వడ్డించినట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇక నుంచి మాంసాహారాన్ని అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది. దీనిపై యాదగిరి గుట్ట స్థానికులు, భక్తులుపెద్ద ఎత్తున తమ నిరసనలు తెలియజేసినట్లు సమాచారం. పవిత్రమైన ఆలయంలో, భక్తుల కోసం ఏర్పాటు చేసిన కాటేజీల్లో ఇలాంటి పనులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.
వెంటనే యాదాద్రి ఆలయ సిబ్బంది స్పందించి, ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. పవిత్రమైన ఆలయంలో ఇలాంటి పనులు చేస్తు, భక్తుల మనోభావాలతో ఆడుకొవద్దని కూడా కొందరు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కొందరు హిందు దేవాలయాలే టార్గెట్ గా చేసుకుని అన్యమతప్రచారంచేస్తున్నారు. అంతేకాకుండా.. మాంసాహార పదార్థాలు తీసుకెళ్లి కావాలని వివాస్పదంగా వ్యవహారిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆలయం సిబ్బంది, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని కూడా హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter