KCR: బరాబర్ ఈసారి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే.. రావడమే కాదు 15 ఏళ్లు పాతుకుపోతాం
Former CM KCR Positive No Doubt BRS Party Will Come Power: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. రావడమే కాకుండా 15 ఏళ్లు పాతుకుపోతుందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
KCR ZP Chairmans Meet: అధికారం కోల్పోవడంతో నిరాశలో ఉన్న పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా ఇస్తున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతోపాటు నాయకులు, కార్యకర్తలు, సాధారణ ప్రజలతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్లతో ఆయన సమావేశమై ఆయా జిల్లాల్లో పరిస్థితులను ఆరా తీశారు. ఈ సందర్భంగా సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మోహమాటంగా వచ్చేది మన ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
Also Read: Electricity Bill Pay: ప్రజల్లారా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా? ఒక్క నిమిషం ఈ విషయం తెలుసుకోండి
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం కేసీఆర్ మంగళవారం రాష్ట్రంలోని పార్టీ జెడ్పీ చైర్మన్లతో సమావేశమయ్యారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్లి అధికారంలోకి వస్తుందని.. రావడమే కాకుండా మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీపై కీలక విషయాన్ని తెలిపారు. 'కాంగ్రెస్‌కు ఒక లక్షణం ఉంది. ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్లు ప్రవర్తిస్తారు. గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత మళ్లీ అలాగే జరిగింది' అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ జడ్పీ చైర్మన్లతో మంగళవారం ఎర్రవెల్లిలోని నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
Also Read: KCR: కేసీఆర్ సంచలన ప్రకటన.. వాళ్లు పోతేపోనీ మిమ్మల్నే ఎమ్మెల్యేలుగా చేసుకుంటాం
ఈ సమావేశంలో భాగంగా కేసీఆర్ జడ్పీ చైర్మన్లను ఘనంగా సన్మానించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాల్క సుమన్, గండ్ర వెంకట రమణారెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పార్టీ నాయకులు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి హాజరైన జడ్పీ చైర్మన్లు
జడ్పీ చైర్మన్లు జనార్దన్ రాథోడ్ (ఆదిలాబాద్), కోరిపెల్లి విజయ లక్ష్మి (నిర్మల్), దాదన్నగారి విఠల్ రావు (నిజామాబాద్ ), దపేందర్ శోభ (కామారెడ్డి), దావా వసంత సురేష్ (జగిత్యాల), పుట్టా మధుకర్ (పెద్దపల్లి), కనుమళ్ల విజయ (కరీం నగర్), న్యాలకొండ అరుణ (రాజన్న సిరిసిల్ల), పటోళ్ల మంజుశ్రీ (సంగారెడ్డి), ర్యాకల హేమలత, వేలేటి రోజారాణి (సిద్దిపేట), శాంతాకుమారి (నాగర్ కర్నూల్), బండా నరేందర్ రెడ్డి (నల్గొండ), గుజ్జ దీపిక (సూర్యాపేట), ఎలిమినేటి సందీప్ రెడ్డి (యాదాద్రి భువనగిరి), ఆంగోత్ బిందు (మహబూబాబాద్), గండ్ర జ్యోతి (వరంగల్ రూరల్), మారపల్లి సుధీర్ కుమార్ (వరంగల్ అర్బన్), జక్కు శ్రీహర్షిని (జయశంకర్ భూపాలపల్లి), బడే నాగజ్యోతి (ములుగు), లింగాల కమల్ రాజ్ (ఖమ్మం).
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter