Electricity Bills Payment: తెలంగాణ ప్రజల్లారా విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారా ఒక్క నిమిషం ఆగండి. ఫోన్ పే, పేటీఎం, అమెజాన్, గూగుల్ పే యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి. థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి బిల్లుల చెల్లింపులు జూలై 1వ తేదీ నుంచి ఆగిపోయాయని తెలంగాణ విద్యుత్ శాఖ ప్రకటించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ద్వారా చెల్లింపులు ఆగిపోయినట్లు ప్రకటించింది. విద్యుత్ బిల్లులు అధికారిక యాప్‌లో లేదా వెబ్‌సైట్‌లో మాత్రమే చెల్లింపులు చేయాలని సూచించింది. ఆన్‌లైన్ లేకుంటే నేరుగా విద్యుత్ కార్యాలయాలకు వచ్చి చెల్లించాలని పేర్కొంది.
Also Read: Hyderabad Metro: భద్రతా ప్రమాణాల్లో నంబర్ వన్ హైదరాబాద్ మెట్రో.. గోల్డెన్ పీకాక్ అవార్డు సొంతం
భారతీయ రిజర్వ్ బ్యాంకు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్ సేవలను నిలిపివేసింది. ఈ కారణంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులకు కీలక ప్రకటన జారీ చేసింది. టీజీఎస్‌పీడీసీఎల్ వెబ్‌సైట్‌లో గానీ తమ అధికారిక మొబైల్ యాప్‌లోనే బిల్లుల చెల్లింపులు చేయాలని స్పష్టం చేశారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి జూలై 1 వేతదీ నుంచి ఆయా చెల్లింపులు సంస్థలు తమ విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసిందని ప్రకటించింది. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో కూడా ఇదే పరిస్థితి. ఇక ఏపీలో కూడా ప్రజలు వివిధ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయడం కుదరడం లేదు.
Also Read: KCR: కేసీఆర్ సంచలన ప్రకటన.. వాళ్లు పోతేపోనీ మిమ్మల్నే ఎమ్మెల్యేలుగా చేసుకుంటాం
ఇన్నాళ్లు వివిధ యాప్‌ల ద్వారా సెకన్‌లలో విద్యుత్ బిల్లులు చెల్లించేవారు. ఈ విధంగా సోమవారం ప్రయత్నించిన వినియోగదారులకు అంతరాయం ఏర్పడింది. బిల్లు చెల్లించేందుకు ప్రయత్నించగా భారత్ బిల్లు పేమెంట్ సిస్టమ్‌కు రిజిస్టర్ కాలేదని చూపించింది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందారు. ప్రస్తుతం ఇంకా ఆర్‌బీఐ విధానాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే వరకు వినియోగదారులు నేరుగా విద్యుత్ కార్యాలయాల్లో కానీ లేదా అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లో బిల్లులు చెల్లించాల్సి ఉంది.
ఆర్‌బీఐ నిబంధన ఇదే..
లావాదేవీల విషయంలో సమర్ధత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపులన్నింటిని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్ ద్వారానే చేయాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ఇంకా విద్యుత్ సంస్థలు నమోదు చేసుకోకపోవడంతో థర్డ్ పార్టీ ద్వారా చెల్లింపులు అనేవి సాధ్యం కావడం లేదు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించరాదని ఆయా సంస్థలు పేర్కొంటున్నాయి.
Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…
— TGSPDCL (@tgspdcl) July 1, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter