ఇక్కడే ఉంటా .. దమ్ముంటే నన్ను కాల్చుకోండి..
పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగు పులుముకున్న తర్వాత అధికారంలో ఉన్న బీజేపీ, మిగతా విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టం-2019కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ రంగు పులుముకున్న తర్వాత అధికారంలో ఉన్న బీజేపీ, మిగతా విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు విపక్ష నేతల నుంచి కౌంటర్లు పడుతున్నాయి.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని దేశద్రోహులుగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అభివర్ణించారు. అంతే కాదు వారిని కాల్చిపారేయాలంటూ ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐతే అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీరియస్ గా తీసుకున్నారు. తుపాకీతో కాలుస్తారా .. ! ఐతే మీరు దేశంలో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానంటూ . . ఇప్పటికే ఓసారి సవాల్ విసిరారు. ఇప్పుడు తాజాగా మరోసారి ప్రధాని మోదీ ప్రభుత్వంపై అసదుద్దీన్ సీరియస్ అయ్యారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను వ్యతిరేకించిన వారిని ముజాహిదీన్ లుగా పిలుస్తున్నారు. అది నిజమే అయితే ..నేనూ ముజాహిదీన్ నే అన్నారు అసద్. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తాను భారత్ లోనే ఉంటానని .. కానీ ఎలాంటి పత్రాలు చూపించనని తెలిపారు. అంతే కాదు పత్రాలు అడిగితే నా గుండె చూపిస్తా.. దమ్ముంటే కాల్చుకోండి అంటూ సవాల్ విసిరారు. నా గుండెల్లో భారత్ పై చాలా ప్రేమ ఉందన్నారు.