Ys sharmila Fire on KCR: తెలంగాణ ప్రజలు రెండు సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అవకాశం ఇచ్చారు. కానీ రైతులను, కూలీలను మోసం చేసారని షర్మిల ఫైర్‌ అయ్యారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం కొత్త కుప్పెన గ్రామంలో రైతు గోస దీక్షలో వైఎస్ షర్మిల పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్ల కాలంలో 8 వేలమంది రైతులు ఆత్మహత్య చేకున్నారన్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇచ్చి ధాన్యాన్ని కొన్నారని గుర్తు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కనీసం కేసీఆర్‌కు మద్దతు ధర అంటే ఏంటో తెలియదని..రైతుల విషయంలో కేసీఆర్ ఓ ఊసరవెల్లిల ప్రవర్తిస్తున్నాడని షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులు మద్దతు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..మద్దతు ధర ఇవ్వలేని ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నట్లు అని ఆమె ప్రశ్నించారు. ఎన్నికలు  దగ్గర పడడటంతో మళ్లీ దొంగ హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్దమవుతున్నరని..ఇప్పటికైన ప్రజలు వాస్తవాన్ని తెలుసుకొని ఓటు వెయాలని షర్మిల పేర్కొన్నారు.


Also Read: AP Govt: అమ్మ ఒడి పథకం రద్దు చేస్తున్నారా..? ఏపీ ప్రభుత్వం ఏమంటోంది..?


Also Read: Mulberry For Health: మల్బరీ తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook