AP Govt: అమ్మ ఒడి పథకం రద్దు చేస్తున్నారా..? ఏపీ ప్రభుత్వం ఏమంటోంది..?

AP Govt: ఈఏడాది అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను రద్దు చేస్తున్నారంటూ ఓ ప్రకటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీ సమాచారం సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో ఉత్తర్వులు ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. 

Written by - Alla Swamy | Last Updated : Jun 1, 2022, 04:09 PM IST
  • అమ్మ ఒడి పథకంపై తప్పుడు ప్రచారం
  • క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
  • నిందితులు ఎవరైనా కఠిన చర్యలని ప్రకటన
AP Govt: అమ్మ ఒడి పథకం రద్దు చేస్తున్నారా..? ఏపీ ప్రభుత్వం ఏమంటోంది..?

AP Govt: ఈఏడాది అమ్మ ఒడి, వాహనమిత్ర పథకాలను రద్దు చేస్తున్నారంటూ ఓ ప్రకటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీ సమాచారం సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో ఉత్తర్వులు ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. అలాంటి ప్రకటన ఏమి చేయలేదని ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్‌ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ అన్నది అసలు లేదని..ఇలాంటి తప్పుడు ప్రచారం ఎవరూ నమ్మ వద్దని అన్నారు. ఇలా తప్పుడు ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీఎం జగన్ సైతం ఈ ఘటనపై సీరియస్‌ అయ్యారని..త్వరలో నిందితులను గుర్తిస్తామన్నారు. 2022 గాను ఎలాంటి పథకాలను రద్దు చేయడం లేదని ఆయన తేల్చి చెప్పారు. 

ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఈ రెండు పథకాలను ఎంచుకున్నారని ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి తెలిపారు. దీని వెనుక ఎవరు ఉన్నా వదిలి పెట్టమన్నారు. దీనిపై పోలీసులు సైతం విచారణ షురూ చేశారని చెప్పారు. ఈమేరకు ఆయన అధికారిక ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి..వాటిని సీఎం జగన్ అమలు చేస్తున్నారని స్పష్టం చేశారు.  

నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు అమలు అయ్యాయని గుర్తు చేశారు. ప్రజలకు లబ్ధి చేకూరే ఏ సంక్షేమ పథకం ఆగదని ఓ ప్రకటనలో తెలిపారు. 

Also read:MS Dhoni Fan: ఎంఎస్ ధోనీ అంటే ఇదే.. అభిమానిని కలిసి కన్నీళ్లు తుడిచిన మహీ!

Also read:Tips to clean white socks: తెల్లటి సాక్స్‌లు నల్లగా మారుతున్నాయా..అయితే ఈ చిట్కాలను పాటించి శుభ్రం చేసుకోండి.!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News