YSRTP Merger With Congress Party: కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్టీపీ విలీనంపై ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. చర్చలు తుది దశకు వచ్చినట్లు వెల్లడించారు. కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేసేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చలు జరిపినట్లు తెలిపారు. తమ పార్టీ నేతలతో చర్చించిన తరువాత విలీనంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి రావాలని ఆమె కోరారు. శనివారం వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌ పంజాగుట్ట సర్కిల్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం మీడియాతో మాట్లాడారు షర్మిల. "వైఎస్సార్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది సోనియా గాంధీ అని మా వాళ్లే నన్ను ప్రశ్నించారు. అలాంటి వాళ్ల ఎలా కలుస్తారని అడిగారు. వైఎస్సార్ విగ్రహం సాక్షిగా ఒక విషయం చెప్పాలి. నేను ఈ విషయం చెప్పక పోతే వైఎస్సార్ అభిమానులకు అసలు విషయం తెలియదు. ఇదే అంశం సోనియా దగ్గర ప్రస్తావనకు తెచ్చాను. రాజీవ్ గాంధీ చనిపోయాక కూడా సీబీఐ ఛార్జ్ షీట్‌లో చేర్చారు అని చెప్పారు. ఆ బాధ ఎంటో మాకు తెలుసు అని అన్నారు. మాకు తెలిసి తెలిసి అలాంటి అవమానం మేము ఎలా చేస్తామని అన్నారు. 


వైఎస్సార్‌పై మాకు అపారమైన గౌరవం ఉందని అన్నారు. వైఎస్సార్ కుటుంబానికి ద్రోహం ఎలా చేస్తామని అన్నారు. వైఎస్సార్ లేని లోటు మాకు ఈ రోజు కూడా తెలుస్తుందన్నారు. నాకు అర్థమైంది ఏమిటి అంటే.. వాళ్లు తెలియక చేసిన పొరపాటే. కాంగ్రెస్ తెలిసి చేసిన తప్పు కాదు. వైఎస్సార్‌ను సోనియా, రాహుల్ అపారంగా గౌరవం ఇస్తున్నారు. వైఎస్సార్‌ మరణించి 14 ఏళ్లు అయింది. అంటే వానవాసం పూర్తయినట్లు. వాళ్లు చేసిన తప్పును క్షమించాలి. నేను నిర్ధారణకు వచ్చిన తర్వాతే సోనియాతో.. రాహుల్‌తో చర్చలు జరిపా.. వాళ్లు రియలైజేషన్‌కి వచ్చారు. అర్థం చేసుకోవాల్సిన బాధ్యత నాది. పాలేరులో పోటీ అంశం త్వరలో వెల్లడిస్తా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులం అందరం కాంగ్రెస్ పార్టీని క్షమించాలి. అవతలి వారిలో రియలైజేషన్ వచ్చినపుడు.. మనలో క్షమించే మనసు రావాలి.." అని ఆమె అన్నారు.


Also Read: IND Vs PAK Updates: టాస్ గెలిచిన టీమిండియా.. రోహిత్ శర్మ కీలక నిర్ణయం.. ఆ ప్లేయర్ జట్టులోకి ఎంట్రీ..!  


Also Read: Mission Aditya L1: నింగిలోకి దూసుకెళ్లిన ఆదిత్య L1.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్  


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook