YS Sharmila: కాంగ్రెస్ కుల రాజకీయం, బీజేపీ మత రాజకీయం... రేవంత్, బండి సంజయ్‌లను ఏకిపారేసిన వైఎస్ షర్మిల...
YS Sharmila Lambasts Revanth and Bandi Sanjay: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
YS Sharmila Lambasts Revanth and Bandi Sanjay: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేస్తోంటే... బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పార్టీలన్నీ రెడ్లకే పగ్గాలు అప్పజెప్పాలని ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను... మసీదులపై బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను షర్మిల ఖండించారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్‌మెయిలర్ అని... ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని విరుచుకుపడ్డారు. రెడ్లకే నాయకత్వం ఇవ్వాలని... ఇతర కులాలు నాయకత్వానికి పనికిరారని రేవంత్ చెబుతున్నారని ఆయనపై మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి మాటలపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఎటువంటి చర్యలు లేవని... కనీసం ఆయన్ను మందలించలేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కులాలు, మతాలకు అతీతంగా వ్యవహరించారని... అన్ని సామాజికవర్గాలను గౌరవించారని, అందరి కోసం పనిచేశారని పేర్కొన్నారు. గొప్ప నాయకుడు అవడానికి కావాల్సింది కులం కాదని... నిజాయితీ, విశ్వసనీయత, సేవ చేయాలనే తపన అని అన్నారు. బ్లాక్‌మెయిర్లను సమాజం హర్షించదు... గౌరవించదన్నారు. రెడ్డి సామాజికవర్గం నిస్వార్ధంగా ఉంది కాబట్టే తెలంగాణ సమాజం వారిని గుర్తించిందని... గౌరవిస్తోందని పర్కొన్నారు.
ఇక బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల మసీదులపై చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఫైర్ అయ్యారు. 'బండి సంజయ్ మసీదులను కూలగొడుతారట... రిజర్వేషన్లు తీసేస్తారట... ఉర్దూ భాషే లేకుండా చేసేస్తారట... ఇంత బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతుంటే ఏ చర్యలైనా తీసుకున్నారా... పిచ్చోడి చేతిలో రాయి... బీజేపీ చేతిలో బండి సంజయ్ చేతిలో బీజేపీ రెండూ ఒకటే...' అని విమర్శించారు. బీజేపీ నీచ రాజకీయాలు చేస్తోందని... మతం పేరుతో చిచ్చు పెడుతోందని మండిపడ్డారు.
ఇటీవల హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కనీసం సంజయ్‌ను మందలించలేదని షర్మిల అన్నారు. అంటే.. సంజయ్ వ్యాఖ్యలను మోదీ కూడా సమర్థిస్తున్నట్లే కదా అని పేర్కొన్నారు. విభజన హామీలు అమలుచేయకుండా.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజలను కోరడం సిగ్గుచేటు అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీని ఆశీర్వదిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరికీ న్యాయం చేస్తామన్నారు. మహిళలకు, వృద్ధులకు, వితంతవులకు, రైతులకు, రైతు కూలీలకు,, నిరుద్యోగులకు న్యాయం చేస్తామన్నారు.
Also Read: Viral News: అరుదైన కేసు... భార్యతో 10ని. శృంగారం తర్వాత 'గజిని'లా మారిన వ్యక్తి...
Also Read: Minister Karumuri Comments: నోరు జారిన ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..ఏంటా కథ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook